News December 29, 2024
REWIND: బేగంపేట ఎయిర్‌పోర్టులో మన్మోహన్ సింగ్.. గుర్తుచేసుకుంటున్న ప్రజలు!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరని తెలిసిన HYD ప్రజలు ఆయన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. బేగంపేట విమానాశ్రయానికి 2011 ఫిబ్రవరి 6న నగర పర్యటనకు వచ్చిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా ట్వీట్లు చేస్తూ, మహోన్నతమైన వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉందని తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరడానికి తమ వంతు కృషి చేస్తామని పలువురు ట్వీట్లు చేశారు.
Similar News
News December 31, 2024
HYD: బీఈ పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగింపు
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని బీఈ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగించినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. బీఈ(ఏఐసీటీఈ), బీఈ (సీబీసీఎస్), బీఈ(నాన్ సీబీసీఎస్) కోర్సుల మెయిన్, బ్యాక్ లాగ్, సప్లమెంటరీ పరీక్షా ఫీజును వచ్చే నెల 3వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని సూచించారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.
News December 31, 2024
HYD: ఏపీ సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ ప్రజలకు తిరుమలలో వెంకటేశ్వర స్వామికి వందల సంవత్సరాలుగా విడదీయరాని అనుబంధం ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. తెలంగాణ ఎమ్మెల్యేల, పార్లమెంట్ సభ్యుల వినతి మేరకు వెంకటేశ్వర స్వామి దర్శనానికి, ఆర్జిత సేవలకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. మంత్రుల, ఎంపీల లేఖలను అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
News December 30, 2024
ఖైరతాబాద్: మాజీ ఎంపీని పరామర్శించిన మంత్రులు
నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథంని మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎమ్మెల్యే వివేక్‌లు సోమవారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మందా జగన్నాథంకి మంచి చికిత్స అందించాలని డాక్టర్ల బృందానికి మంత్రులు సూచించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.