News April 8, 2024

REWIND: మాచర్లలో 80 ఓట్ల మెజార్టీతో MLA

image

మాచర్లలో 1967 ఎన్నికల్లో 80 ఓట్ల మెజారిటీతో వెన్న లింగారెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఈయన జూలకంటి నాగిరెడ్డిని ఓడించారు. ఈ నియోజకవర్గంలో ఇదే ఇప్పటి వరకు అత్యల్ప మెజారిటీ. మరోవైపు, ఇదే నియోజకవర్గంలో పి. లక్ష్మారెడ్డిది అత్యధిక మెజారిటీ. (2004లో 30,666). తాజా ఎన్నికల్లో వైసీపీ నుంచి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, కూటమి నుంచి జూలకంటి బ్రహ్మనందరెడ్డి పోటీ పడుతున్న విషయం తెలిసిందే.

Similar News

News September 9, 2025

జల్ జీవన్ మిషన్ పనులు వేగవంతం చేయండి: కలెక్టర్ నాగలక్ష్మి

image

గ్రామాల్లో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని కలెక్టర్ నాగలక్ష్మి అధికారులను ఆదేశించారు. చిన్న, మధ్యతరహా పనులకు వారం రోజుల్లో, పెద్ద పనులకు రెండు వారాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై సమీక్షించిన అనంతరం ఆమె ఈ ఆదేశాలు జారీ చేశారు.

News September 9, 2025

తాడేపల్లిలో రేపు జగన్ మీడియా సమావేశం

image

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విలేఖరుల సమావేశం నిర్వహించనున్నారు. రైతుల సమస్యలు, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, భూముల దోపిడీ వంటి అంశాలపై ఆయన మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

News September 9, 2025

అమరావతికి మరో ప్రముఖ సంస్థ

image

అమరావతికి మరో ప్రముఖ సంస్థ వస్తుంది. రూ.200 కోట్లతో అమరావతిలో 4 ఎకరాల్లో వివాంత (తాజ్ గ్రూప్) 5-స్టార్ హోటల్ నిర్మాణం కానుంది. మందడం సమీపంలో సీడ్ ఆక్సిస్ రోడ్డు పక్కన CRDA స్థలం కేటాయించగా ప్రస్తుతం చదును చేస్తున్నారు. 2028 నాటికి ఈ 5-స్టార్ హోటల్ ప్రారంభం అయ్యేలా కసరత్తు చేస్తున్నారు. అమరావతి ఆతిథ్యం, పెట్టుబడి రంగానికి ఇది ఒక పెద్ద ప్రోత్సాహం అని పలువురు అంటున్నారు