News March 20, 2024
REWIND: వంగా గీతకు 169 ఓట్లు
వంగా గీత 1994లో పిఠాపురం నుంచి పోటీ చేశారు. TDPలో వర్గపోరుతో తొలుత ఆమెను అభ్యర్థిగా ప్రకటించినా బీఫారం వెన్నా నాగేశ్వర రావుకు అందించారు. అప్పట్లో ఆమెకు చంద్రబాబు, బాలయోగి ఆశీస్సులు ఉన్నా టికెట్ దక్కలేదు. నామినేషన్ తర్వాత బీఫారం కోసం చివరి వరకు ఆమె హైదరాబాద్‌లో ఉండటంతో దాన్ని ఉపసంహరించుకునే ఛాన్స్ దక్కలేదు. ఆమె పేరు బ్యాలెట్ పేపర్ మీద ఉన్నా ఎటువంటి ప్రచారం చేయలేదు. అయినా 169 ఓట్లు దక్కాయి.
Similar News
News November 22, 2024
కాగ్ అధిపతిగా కోనసీమ జిల్లా వాసి ప్రమాణ స్వీకారం
ప్రతిష్ఠాత్మక భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బాధ్యతలను అమలాపురం మాజీ ఎంపీ కెఎస్ఆర్ మూర్తి కుమారుడు కొండ్రు సంజయ్‌మూర్తి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్ మూర్తి అరుదైన ఘనత సాధించారు. 1964 డిసెంబర్ 24న జన్మించిన ఆయన మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు.
News November 21, 2024
మారేడుమిల్లి: జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ అనంతబాబు
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ను ఎమ్మెల్సీ అనంతబాబు గురువారం తాడేపల్లిలో కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో రంపచోడవరం నియోజకవర్గంలోని పలు రాజకీయ విషయాలను గూరించి చర్చించామని ఎమ్మెల్సీ మీడియాకు తెలిపారు. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు ఆపద సమయంలో అండగా ఉండమని జగన్ సూచించారని ఎమ్మెల్సీ తెలిపారు. అడ్డతీగల జడ్పీటీసీ వీర్రాజు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని సమస్యలపై పోరాడాలని సూచించారన్నారు.
News November 21, 2024
శాసనమండలిలో భూ సమస్యలపై MLC వెంకటేశ్వరరావు గళం
శాసనమండలిలో భూ సమస్యలపై తూ.గో, ప.గో జిల్లాల పట్టభధ్రుల MLC వెంకటేశ్వరరావు గళం వినిపించారు. ఆన్‌లైన్‌లో భూమి రకం, విస్తీర్ణాలు తప్పుల తడకగా చూపిస్తున్నాయని అన్నారు. అంతే కాకుండా తక్కువ భూమి ఉన్న వారికి ఎక్కువ భూమి చూపిస్తూ ఉండడంతో వారు సంక్షేమ పథకాలు కోల్పోతున్నారని ఆయన వివరించిన తీరు ఆకట్టుకుంది. రైతులు అధికారుల చుట్టూ తిరిగినా సమస్య తీరడం లేదన్నారు. దీనికి పరిష్కారం చూపాలని కోరారు.