News December 27, 2025
REWIND: సునామీని ముందే ఊహించిన చిన్నారి

2004 నాటి <<18673724>>సునామీ<<>>కి నిన్నటితో 21 ఏళ్లు పూర్తయ్యాయి. అయితే ఆ సమయంలో పదేళ్ల టిల్లీ స్మిత్ సునామీని ముందే గ్రహించింది. డిసెంబర్ 26న థాయిలాండ్ వెళ్లిన టిల్లీ.. సముద్రం వెనక్కి వెళ్లడం, నీటిలో బుడగలు రావడాన్ని గమనించింది. వెంటనే తల్లిదండ్రులను హెచ్చరించడంతో వందల మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇదంతా తాను జియోగ్రఫీ క్లాస్‌లో నేర్చుకున్నట్లు తెలిపింది. ఆ చిన్నారిని నెటిజన్లు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు.
Similar News
News January 8, 2026
భారీ జీతంతో నీతిఆయోగ్‌లో ఉద్యోగాలు

<
News January 8, 2026
రూ.26.30 కోట్ల ఫ్లాట్ కొన్న రోహిత్ భార్య

రోహిత్ శర్మ భార్య రితికా ముంబైలోని ప్రభాదేవీ ప్రాంతంలో రూ.26.30 కోట్ల ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. దీని విస్తీర్ణం 2,760sq ft. స్టాంప్ డ్యూటీ కింద రూ.1.31 కోట్లు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.30వేలు చెల్లించారు. ప్రస్తుతం హిట్‌మ్యాన్ దంపతులు నివాసం ఉంటున్న లగ్జరీ అహూజా టవర్స్‌లోనే ఈ ఫ్లాట్ ఉంది. రోహిత్ దంపతులు కొన్నేళ్లుగా రియల్‌ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్న విషయం తెలిసిందే.
News January 8, 2026
ఒత్తిడి పెరిగితే అందం తగ్గిపోతుంది

ఒత్తిడికి ఎక్కువగా గురయ్యే మహిళలు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఇంటర్నేషనల్ జర్నల్ అఫ్ సైన్స్ అండ్ రీసర్చ్ ప్రచురించిన నివేదికలో పేర్కొన్నారు. ఒత్తిడి వల్ల వృద్ధాప్య ఛాయలు ముందే రావడంతో పాటు నెలసరి సమస్యలు, బీపీ, షుగర్ వంటివి దాడి చేస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి సరిపడా నీరు, నిద్ర, పోషకాలున్న ఆహారం, వ్యాయామాలు, ధ్యానం ఉపయోగపడతాయని చెబుతున్నారు.


