News March 17, 2025

REWIND: 1967వ నాటి ఆమదాలవలస రైల్వే స్టేషన్

image

ఆమదాలవలస పట్టణంలో శ్రీకాకుళం రోడ్డు పేరుతో ఉన్న రైల్వే స్టేషన్ జిల్లాలోని అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా ఉంది. అలాంటి రైల్వే స్టేషన్ 1967వ సంవత్సరంలో ఎలా ఉండేదో తెలిపే పాత ఫొటో వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్‌బుక్ అకౌంట్‌లలో ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. అప్పటిలో ఆమదాలవలస పట్టణాన్ని ఆముదం పట్టణంగా పిలిచేవారని, అశోకుడి కాలంలో హేరందపల్లిగా పిలుచుకునే వారిని ప్రస్తుతం ఈ ఫొటో ద్వారా చర్చనీయాంశంగా మారింది. 

Similar News

News November 29, 2025

టెక్కలి డివిజన్లోకి నందిగాం.. మీ అభిప్రాయమేంటి?

image

గతంలో నియోజకవర్గ పరిధి, డివిజినల్ కేంద్రమైన టెక్కలి పరిధిలో ఉన్న నందిగాం మండలంను గత ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన పలాస డివిజన్లో కలిపింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరిగి టెక్కలి డివిజన్ లో కలుపుతూ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. ఏవైనా అభ్యంతరాలు, సూచనలు ఉంటే నెల రోజుల లోపు లిఖితపూర్వకంగా కలెక్టర్ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు సమర్పించాలి.

News November 29, 2025

వజ్రపుకొత్తూరు: కోతల అనంతరం చేతి ‘కందే’ లా!

image

జిల్లాలో ప్రధానంగా సాగు చేసే వరి పంట దాదాపుగా కోత దశలో ఉంది. అయితే ముందుచూపుతో గట్లపై అంతర పంటగా కంది సాగు చేయడంతో ఇప్పుడు ఏపుగా పెరిగి రైతన్నల్లో ఆశలు రేకెత్తిస్తోంది. నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతంలో కూడా మంచు కురుస్తుండటంతో కంది పంటకు ఢోకా లేదని అన్నదాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు కంది, బంతి, చామంతి పూలు, పాదు రకాల కాయకూరలు పండిస్తూ రోజు వారీ ఆదాయం సంపాదిస్తున్నారు.

News November 29, 2025

శ్రీకాకుళం: కానిస్టేబుల్‌ను ఈడ్చికెళ్లిన ఆటో.. డ్రైవర్‌కు జైలు శిక్ష

image

శ్రీకాకుళంలో ట్రాఫిక్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను మురళీకృష్ణను ఆటోతో డ్రైవర్ శ్రీనివాసరావు ఈడ్చుకొని వెళ్లిన ఘటనపై కేసు నమోదు చేశామని ట్రాఫిక్ సీఐ రామారావు తెలిపారు. మురళీకృష్ణకు గాయాలు కాగా డ్రైవర్‌ను మెజిస్ట్రేట్ శివరామకృష్ణ వద్ద హాజరుపరచగా 7 రోజుల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. శ్రీనివాసరావును సబ్ జైలుకు తరలించినట్లు చెప్పారు. రహదారిపై ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే చర్యలు తప్పవన్నారు.