News June 3, 2024
REWIND 2023: కంటోన్మెంట్‌లో BRS గెలుపు!
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్‌లో 1,23,397 ఓట్లు పోలయ్యాయి.
లాస్య నందిత(BRS)-59,057(WIN)
శ్రీ గణేశ్(BJP)-41,888
వెన్నెల(INC)-20,825 ఓట్లు పడ్డాయి.
లాస్య నందిత అకాల మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. గతంలో BJP నుంచి పోటీ చేసి ఓడిన శ్రీ గణేశ్ ప్రస్తుతం INC నుంచి పోటీ చేశారు. నివేదిత సాయన్న(BRS), వంశతిలక్(BJP) బరిలో ఉన్నారు. ఉప ఎన్నికలో 1,30,929 మంది ఓటేశారు. మరి గెలుపెవరిది.. మీ కామెంట్?
Similar News
News September 19, 2024
HYD: సేవాసంస్థలకు దరఖాస్తుల ఆహ్వానం
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకునివృద్ధులు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు విశేష సేవలు అందించిన సంస్థలు ఈనెల 25లోపు హైదరాబాద్ నల్గొండ చౌరస్తాలోని వికలాంగుల సంక్షేమ భవనంలో దరఖాస్తులు అందించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సంక్షేమ అధికారి కృష్ణారెడ్డి తెలిపారు. దరఖాస్తు ఫార్మ్ వెబ్‌సైట్‌లో పొందవచ్చని పేర్కొన్నారు. www.wdsc.telangana.gov.in
News September 19, 2024
బీసీ విదేశీవిద్యకు దరఖాస్తుల ఆహ్వానం
మహాత్మ జ్యోతిరాబా ఫులే విదేశీ విద్యా పథకం కింద ఫాల్ సీజన్‌కు అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు అక్టోబరు 15లోగా ‘ఈ పాస్’ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి తెలిపారు. అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలని, ఇంజినీర్, మేనేజ్‌మెంట్, సైన్స్, వ్యవసాయం, మెడిసిన్, నర్సింగ్, సోషల్ సైన్సెస్, అగ్రికల్చర్, హ్యుమానిటీస్‌లో 60% మార్కులు సాధించాలని పేర్కొన్నారు.
News September 19, 2024
BREAKING..HYD: టెండర్లు ఆహ్వానిస్తున్న హైడ్రా
కూల్చివేతల వ్యర్థాల తొలగింపునకు హైడ్రా టెండర్లు ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తున్నట్లు తెలిపింది. నేటి నుంచి ఈనెల 27 వరకు బిడ్లు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటివరకు 23 చోట్ల 262 నిర్మాణాలను కూల్చివేసిన విషయాన్ని ఇదివరకే ప్రకటించింది.