News June 3, 2024

REWIND 2023: కంటోన్మెంట్‌లో BRS గెలుపు!

image

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్‌‌లో 1,23,397 ఓట్లు పోలయ్యాయి.
లాస్య నందిత(BRS)-59,057(WIN)
శ్రీ గణేశ్(BJP)-41,888
వెన్నెల(INC)-20,825 ఓట్లు పడ్డాయి.
లాస్య నందిత అకాల మరణంతో‌ ఉపఎన్నిక అనివార్యమైంది. గతంలో BJP నుంచి పోటీ చేసి ఓడిన శ్రీ గణేశ్‌ ప్రస్తుతం INC నుంచి పోటీ చేశారు.‌ నివేదిత సాయన్న(BRS), వంశతిలక్‌(BJP) బరిలో ఉన్నారు. ఉప ఎన్నికలో 1,30,929 మంది ఓటేశారు. మరి గెలుపెవరిది.. మీ కామెంట్?

Similar News

News July 6, 2025

HYD: త్వరలో వాట్సప్ బస్ టికెట్

image

గ్రేటర్ HYDలో త్వరలో వాట్సప్ టికెటింగ్, డిజిటల్ బస్ పాస్ అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఇప్పటికే క్యూఆర్ కోడ్ RTC బస్ టికెట్ విధానం అందుబాటులో ఉంది. జస్ట్ QR కోడ్ స్కాన్ చేసి, ఫోన్లో పేమెంట్ చేస్తే టికెట్ వస్తుంది. ఇవన్నీ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో ఒక భాగం. ఈ సేవలను మరింత విస్తరిస్తామని తెలిపారు.

News July 6, 2025

బోరబండలో భార్యను హత్య చేసిన భర్త

image

HYD బోరబండ PS పరిధిలో భార్యను భర్త హత్య చేశాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. సోనీ, నర్సింలు దంపతులు. మద్యానికి బానిసై నర్సింలు తాగివచ్చి తరుచూ చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ నేపథ్యంలో భార్య సోనీ తన పుట్టింటికి వెళ్లింది. తిరిగి వచ్చిన తర్వాత 3 రోజులుగా మళ్లీ చిత్రహింసలు పెడుతూ విచక్షణారహితంగా కొట్టడంతో సోనీ మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 6, 2025

HYD: నేడు సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు

image

మొహరం నేపథ్యంలో బీబీ కా ఆలం ఊరేగింపులో భాగంగా నేడు HYDలోని సాలార్ జంగ్ మ్యూజియానికి సెలవు ఉంటుందని మ్యూజియం అడ్మినిస్ట్రేటివ్ అధికారి తెలిపారు. అదేవిధంగా బీబీ కా ఆలం ఊరేగింపు చార్మినార్ ప్రధాన మార్గాల్లో కొనసాగనున్న నేపథ్యంలో చార్మినార్‌లోకి ప్రవేశం ఉండదన్నారు. సోమవారం తిరిగి సాలార్ జంగ్ మ్యూజియంలోకి ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు.

-SHARE IT