News October 22, 2025

REWIND 2023 పోల్.. జూబ్లీహిల్స్‌లో ఎవరికెన్ని ఓట్లు వచ్చాయంటే?

image

2023 డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ నుంచి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. BRS నుంచి పోటీ చేసి మాగంటి గోపీనాథ్ 80,549 ఓట్లు సాధించి విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ 64,212 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి 25,866 ఓట్లు సాధించగా ఎంఐఎం అభ్యర్థి రషీద్ ఫరాజుద్దీన్ 7,848 ఓట్లు పొందారు.

Similar News

News October 22, 2025

టీచర్లకూ టెట్.. త్వరలో నోటిఫికేషన్!

image

AP: టీచర్లకూ టెట్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు జాబ్‌లో కొనసాగాలంటే టెట్ పాస్ కావాల్సిందేనని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టింది. నిరుద్యోగులు, టీచర్లకు కలిపి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్నవారు రెండేళ్లలో టెట్ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.

News October 22, 2025

నరసాపురం: కీచక తండ్రి కటకటాల్లోకి..!

image

కన్న కూతురిపై అఘాయిత్యానికి పాల్పడిన తండ్రిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నరసాపురానికి చెందిన మహిళ తన ఇద్దరు కుమార్తెలను భర్త వద్ద వదిలి గల్ఫ్ వెళ్లింది. ఈ క్రమంలో ఆ తండ్రి తాగి వచ్చి తన కుమార్తె (13) పట్ల కీచకుడయ్యాడు. ఇటీవల గల్ఫ్ నుంచి తల్లి రావడంతో కుమార్తెలు విషయం చెప్పారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు విచారణ అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా రిమాండు విధించారు.

News October 22, 2025

జనగామ జిల్లాలోని శివాలయాలు ఇవే

image

నేటి నుంచి కార్తీక మాసం ఆరంభం కావడంతో జనగామ జిల్లాలోని ప్రముఖ శివాలయాలు ఇవే.
* పాలకుర్తి సోమేశ్వరాలయం
* కొడవటూర్ సిద్ధేశ్వరాలయం
* చీటకోడూరు పంచకోసు రామలింగేశ్వరస్వామి
* జనగామ పట్టణంలోని శివాలయం
మీ ప్రాంతంలోని ప్రసిద్ధి చెందిన శివాలయాలు ఉంటే కామెంట్‌లో ఆలయం పేరు, లొకేషన్ తెలపండి.