News January 1, 2026
REWIND 2025: వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు కృష్ణా జిల్లా జోరు

కృష్ణా జిల్లా ఏడాదిలో ఆర్థికంగా దూసుకెళ్లింది. వ్యవసాయం, సేవలు, పరిశ్రమల రంగాల్లో సాధించిన వృద్ధితో రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచి ప్రత్యేక గుర్తింపు సాధించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.1,02,558 కోట్ల జీడీడీపీ లక్ష్యాన్ని నిర్దేశించగా, ఏప్రిల్–సెప్టెంబర్ మధ్యనే రూ.47,009 కోట్ల ఉత్పత్తి సాధించి 45.84% పురోగతి నమోదు చేసింది. వ్యవసాయ రంగంలో రూ.45,679 కోట్ల GVAతో రాష్ట్రంలో 2వ స్థానంలో ఉంది.
Similar News
News January 2, 2026
ప.గో: ‘వాహనదారులు అప్రమత్తంగా ఉండాలి’

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవం-2026 సందర్భంగా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాన్ నయీం అస్మి గోడపత్రికలు, కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారులు వాహనాలు నడిపేటప్పుడు అత్యంత అప్రమత్తతతో ఉండాలన్నారు.
News January 2, 2026
2025లో శ్రీవారి ఆదాయం రూ.1,383 కోట్లు

AP: 2025లో తిరుమల శ్రీవారికి భారీగా ఆదాయం వచ్చింది. హుండీ ద్వారా రూ.1,383.90 కోట్లు లభించగా, ఇది 2024తో పోలిస్తే రూ.18 కోట్లు అధికం. 2.61 కోట్ల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. లడ్డూ విక్రయాల్లోనూ రికార్డు నమోదైంది. మొత్తం 13.52 కోట్ల లడ్డూలు అమ్ముడవగా, గత ఏడాదితో పోలిస్తే 1.37 కోట్లు ఎక్కువ. డిసెంబరు 27న గత పదేళ్లలో అత్యధికంగా 5.13 లక్షల లడ్డూల విక్రయం జరిగింది.
News January 2, 2026
HYDలో ఎన్నికలు ఎప్పుడంటే?

గ్రేటర్ HYDను మూడు భాగాలు చేసే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం వాటికి ఎన్నికలు కూడా నిర్వహించనుంది. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్లను అధికారికంగా ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికలకు ఎప్పుడు వెళ్లాలనేదానిపై కాంగ్రెస్‌లో చర్చలు జరుగుతున్నాయి. ఎండా కాలం ముగిసిన తర్వాతే అంటే జూన్ తర్వాత ‘గ్రేటర్’ ఎలక్షన్స్ ఉండవచ్చని తెలుస్తోంది. ఇదిలా ఉండగా ప్రస్తుత కౌన్సిల్ గడువు వచ్చేనెల 10వరకు ఉంది.


