News March 25, 2024
REWIND: 9 ఓట్లతో అనకాపల్లి ఎంపీగా గెలిచారు

అనకాపల్లి ఎంపీగా 1989లో కొణతాల రామకృష్ణ కేవలం 9 ఓట్ల మెజార్టీతోనే గెలిచారు. ఈ స్థానానికి 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఈ మెజార్టీనే అత్యల్పం. కొణతాల ప్రస్తుతం అనకాపల్లి జనసేన MLA అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వెంకట సత్యవతి 89,829 ఓట్ల మెజార్టీతో గెటిచారు. ఈసారి టీడీపీ కూటమి అభ్యర్థిగా సీఎం రమేశ్ బరిలో ఉండగా.. వైసీపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.
Similar News
News November 28, 2025
డిసెంబర్ నెలలో రేషన్ డిపోలలో రాగుల పంపిణీ: విశాఖ జేసీ

డిసెంబర్ నెలలో రేషన్ డిపోలలో రాగులు పంపిణీ చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ శుక్రవారం తెలిపారు. లబ్ధిదారులకు మూడు కేజీల బియ్యానికి బదులుగా మూడు కేజీల రాగులు అందజేయనున్నట్లు వెల్లడించారు. రేషన్ డిపోలకు వెళ్లే లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
News November 28, 2025
విశాఖ జూ పార్కుకు కొత్త నేస్తాల రాక

విశాఖ జూ పార్కుకు జంతు మార్పిడి విధానంలో కొత్త జంతువులు తీసుకొచ్చారు. జార్ఖండ్ రాష్ట్రం బిర్ష జూ పార్కు నుంచి హిమాలయన్ నల్లని ఎలుగుబంట్లు, గరియల్, స్పార్టెడ్ డవ్, సిల్వర్ పీజంట్ అనే జంతువులను, పక్షులను విశాఖ జూకు తీసుకొచ్చినట్లు క్యూరేటర్ జీ.మంగమ్మ తెలిపారు. విశాఖ జూ నుంచి కొన్ని జంతువులను అక్కడి జూకి పంపించినట్లు చెప్పారు. కొత్తగా వచ్చిన వీటిని కొన్ని రోజులపాటు క్వారంటైన్లో ఉంచుతామన్నారు.
News November 28, 2025
జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ ఫోరమ్కు 21 వినతులు

జీవీఎంసీలో శుక్రవారం నిర్వహించిన ‘టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్’కు 21 వినతులు వచ్చినట్లు చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకారరావు తెలిపారు. సాధారణ స్పందనలో రద్దీ తగ్గించేందుకు ప్రతి శుక్రవారం ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. జోన్-3 నుంచి అత్యధికంగా 7 అర్జీలు రాగా.. స్వీకరించిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు.


