News March 25, 2024

REWIND: 9 ఓట్లతో అనకాపల్లి ఎంపీగా గెలిచారు

image

అనకాపల్లి ఎంపీగా 1989లో కొణతాల రామకృష్ణ కేవలం 9 ఓట్ల మెజార్టీతోనే గెలిచారు. ఈ స్థానానికి 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. ఈ మెజార్టీనే అత్యల్పం. కొణతాల ప్రస్తుతం అనకాపల్లి జనసేన MLA అభ్యర్థిగా బరిలో ఉన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వెంకట సత్యవతి 89,829 ఓట్ల మెజార్టీతో గెటిచారు. ఈసారి టీడీపీ కూటమి అభ్యర్థిగా సీఎం రమేశ్ బరిలో ఉండగా.. వైసీపీ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.

Similar News

News November 12, 2024

‘విప్’లుగా గణబాబు, వేపాడ చిరంజీవి

image

శాసనసభ విప్‌గా విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబును ప్రభుత్వం నియమించింది. శాసన మండలిలో విప్‌గా ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. గణబాబు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవగా.. 2017 నుంచి 2019 వరకు విప్‌గా పనిచేశారు. వేపాడ చిరంజీవి 2023 మార్చిలో జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలలో గెలుపొందారు.

News November 12, 2024

విశాఖ: స్మశాన వాటికలో కార్పొరేటర్ నిరసన దీక్ష

image

జీవీఎంసీ 22వ వార్డు స్మశాన వాటికలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనసేన ఆధ్వర్యంలో బుధవారం(రేపు) నిరసన దీక్ష చేపట్టనున్నట్లు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తెలిపారు. స్మశాన వాటిక అభివృద్ధి పనుల విషయంలో అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రెండేళ్లు కావస్తున్నా అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదు అన్నారు. జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్య వైఖరే దీనికి కారణం అన్నారు.

News November 12, 2024

విశాఖలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య

image

గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లపువానిపాలెంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి నిఖిల్ ఈశ్వర్ రావు(16) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటిలో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గోపాలపట్నం పోలీసులు మంగళవారం ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.