News March 22, 2024
REWIND: జనతా కర్ఫ్యూకి నాలుగేళ్లు

కొవిడ్ మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసింది. అయితే, కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం 2020 మార్చి 22న దేశంలో ‘జనతా కర్ఫ్యూ’ విధించింది. నేటికి నాలుగేళ్లు పూర్తవుతోంది. ఆ తర్వాత క్రమంగా దాదాపు 2 నెలల పాటు లాక్డౌన్ కొనసాగింది. వైరస్ని కట్టడి చేసేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నా.. ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాని నుంచి కోలుకునేందుకు ఏడాది పట్టింది.
Similar News
News April 7, 2025
RARE: గోల్డెన్ టైగర్ను చూశారా?

అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్కులో అరుదైన గోల్డెన్ టైగర్ కనిపించింది. వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ సుధీర్ శివరామ్ బంగారు వర్ణపు పులి ఫొటోలను తన కెమెరాలో బంధించారు. సూడోమెలనిజం అనే అరుదైన జన్యు మార్పు కారణంగా ఇవి బంగారు-నారింజ రంగులో ఉంటాయని పశుసంరక్షణ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటివి చాలా అరుదని, ఎక్కడో ఓ చోట మాత్రమే కనిపిస్తాయని తెలిపారు.
News April 7, 2025
ఇవి ఎక్కువ తినకండి: సీఎం చంద్రబాబు

AP: చెడు ఆహారపు అలవాట్ల వల్ల అనారోగ్య సమస్యలు వస్తున్నాయని CM చంద్రబాబు తెలిపారు. చాలా వ్యాధుల నివారణకు నియంత్రిత ఆహారపు అలవాట్లు అవసరమని సూచించారు. ‘నలుగురు సభ్యుల కుటుంబంలో నెలకు 600 గ్రాముల ఉప్పు, 2 లీటర్ల వంట నూనె, 3 కిలోల పంచదార వాడితే సరిపోతుంది. ఉప్పు, వంటనూనె, చక్కెర తగ్గిస్తే ఆరోగ్య సమస్యలు దరిచేరవు. రాష్ట్ర ప్రజలు ప్రతిరోజూ అరగంట వ్యాయామం చేయాలి’ అని సీఎం పిలుపునిచ్చారు.
News April 7, 2025
తులం బంగారం రూ.56వేలు కాబోతోందా..?

రానున్న రోజుల్లో పసిడి ధర 38% మేర పతనం అవుతుందని అంచనా వేస్తున్నట్లు USA అనలిస్ట్ జాన్ మిల్స్ వెల్లడించారు. అమెరికాలో ఇప్పుడు $3080గా ఉన్న ఔన్స్ పుత్తడి $1820కు దిగి రావచ్చన్నారు. అంటే మన దగ్గర 10గ్రా. ₹56వేలకు వస్తుందన్నమాట. బంగారం సప్లై పెరగడం, డిమాండ్ తగ్గడం, మార్కెట్ పరిస్థితులు దీనికి కారణాలుగా పేర్కొన్నారు.
NOTE: ఇది మిల్స్ అంచనా. అన్ని పరిశీలించి కొనుగోలు/అమ్మకాల నిర్ణయం తీసుకోండి.