News December 3, 2024
REWIND: HYDలో ఆత్మార్పణం

తెలంగాణ మలిదశ ఉద్యమంలో శ్రీకాంత చారి ప్రాణత్యాగం పోరాటాన్ని ఉవ్వెత్తున ఎగిసేలా చేసింది. 2009 నవంబర్ 29న ఎల్బీనగర్లో జరిగిన ధర్నాలో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న శ్రీకాంత చారి నిప్పంటించుకున్నాడు. మంటల్లో కాలుతూ ‘జై తెలంగాణ.. జై తెలంగాణ’ అంటూ ఆయన చేసిన నినాదాలు ఉద్యమకారుల కంట నీరు తెప్పించాయి. తీవ్రగాయాలతో యశోద ఆస్పత్రిలో చేరిన ఆయన డిసెంబర్ 3(2009)న చనిపోయారు. నేడు శ్రీకాంత చారి వర్ధంతి.
Similar News
News September 18, 2025
HYD: క్షీణించిన అశోక్ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు

HYDలో నిరుద్యోగ సమితి నాయకులు అశోక్ ఆమరణ నిరాహార దీక్ష 4 రోజులుగా చేస్తుండగా ఆరోగ్యంగా క్షీణించింది. దీంతో ఆయనను వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లుగా బృందాలు తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు తన ఆమరణ నిరాహార దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పారు.
News September 18, 2025
HYD: అర్జున్ గల్లంతు.. వలిగొండలో డెడ్‌బాడీ లభ్యం

అఫ్జల్‌సాగర్ నాలాలో <<17748449>>4రోజుల<<>> క్రితం గల్లంతైన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరి మృతదేహం లభ్యమైంది. యాదాద్రి జిల్లా వలిగొండ సమీపంలో మూసీ నదిలో అర్జున్ మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు కడసారి చూసేందుకు పిల్లాపాపలతో అక్కడికి బయలుదేరారు. మరో వ్యక్తి ఆచూకీ తెలియరాలేదు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
News September 18, 2025
HYD: డబ్బు ఊరికే రాదుగా.. జాగ్రత్తలు చెప్పండి!

ఇంట్లోని వృద్ధుల స్మార్ట్ ఫోన్లను గమనిస్తూ ఉండండి. మీరు దగ్గర లేకపోతే జాగ్రత్తలు చెబుతూ ఉండండి. ఇటీవల సైబర్ నేరస్థులు వృద్ధులను టార్గెట్ చేస్తూ డిజిటల్ అరెస్ట్ పేరుతో అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు. ఇటీవల బషీర్‌బాగ్‌లో ఓ రిటైర్డ్ లేడీ అధికారి సైబర్ నేరస్థుల బారిన పడి గుండెపోటుతో మృతి చెందారు. అందుకే అన్వాంటెడ్ కాల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎత్తొద్దని, పలు జాగ్రత్తలు చెప్పండి.