News November 29, 2024
REWIND: KCR అరెస్ట్.. NIMSలోనే దీక్ష విరమణ

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. 29 NOV 2009లో కరీంనగర్లోని తెలంగాణభవన్ నుంచి సిద్దిపేటలోని దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. జైలులో దీక్ష చేయగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే NIMSకు తరలించారు. DEC 9న కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రావడంతో KCR NIMSలో దీక్ష విరమించారు.
Similar News
News December 3, 2025
REWIND: రంగారెడ్డిలో 135 ఏకగ్రీవం.. రూపాయి రాలేదు

గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. ఫిబ్రవరి 2న పాలకవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించింది. ఏకగ్రీవ చిన్న పంచాయతీలకు రూ.10లక్షలు, పెద్ద పంచాయతీలకు రూ.15 లక్షల చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మొత్తం 1,185 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. 135 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. సర్పంచ్ పదవీ కాలం ముగిసినా ఏకగ్రీవ పంచాయతీలకు ఇంకా పారితోషకం అందలేదు.
News December 2, 2025
RR: ‘రెండో విడత నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి’

గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికలు అన్ని విధాలా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ జిల్లా కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీసు ఉన్నతాధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఎలాంటి తప్పిదాలకు తావు ఇవ్వకుండా అధికారిని నడుచుకోవాలని ఆదేశించారు.
News November 30, 2025
రంగారెడ్డి: మొదటి రోజు 450 నామినేషన్లు

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి రోజు కందుకూరు, చేవెళ్ల రెవెన్యూ డివిజన్ పరిధిలో మొత్తం 450 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అందులో 178 పంచాయతీ స్థానాలకు 152 నామినేషన్ దాఖలు కాగా 1540 వార్డు స్థానాలకు 298 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఉదయం 10:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది.


