News November 29, 2024

REWIND: KCR అరెస్ట్.. NIMS‌లోనే దీక్ష విరమణ

image

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. 29 NOV 2009లో కరీంనగర్‌లోని తెలంగాణ‌భవన్ నుంచి సిద్దిపేటలోని దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. జైలులో దీక్ష చేయగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే NIMSకు తరలించారు. DEC 9న కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రావడంతో KCR NIMSలో దీక్ష విరమించారు.

Similar News

News December 2, 2024

HYD: మాలలకు రాజ్యాంగం మద్దతు ఉంది: రాజేశ్ మహాసేన

image

పరేడ్ గ్రౌండ్లో జరిగిన మాలల సింహగర్జన సభకు ఆంధ్రా నుంచి పిలుపు అందుకున్న రాజేశ్ మహాసేన వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంద కృష్ణ మాదిగ 30 ఏళ్లుగా రాష్ట్ర, కేంద్ర నాయకులు, సుప్రీంకోర్టు మద్దతు ఉంది అని చెప్పుకుంటు తిరుగుతున్నారన్నారు. దేశం మొత్తం మద్దతు వుండొచ్చు కానీ తమ జాతికి డా.అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి మాలలు భారీగా తరలివచ్చారు.

News December 2, 2024

HYD: చుక్కా రామయ్య ఆరోగ్యంపై హరీశ్‌రావు ఆరా

image

నల్లకుంటలోని మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త ఐఐటీ చుక్కా రామయ్య ఆరోగ్యంపై మాజీ మంత్రి హరీశ్‌‌రావు ఆరా తీశారు. అంబర్‌పేట MLA కాలేరు వెంకటేశ్‌తో కలిసి హరీశ్‌రావు ఆయనతో ముచ్చటించారు. గత నెల 20న చుక్కా రామయ్య పుట్టినరోజు రాలేకపోయానని తెలిపారు. దేశపతి శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ తదితర నాయకులు ఉన్నారు.

News December 1, 2024

HYD: మాలలు ఐక్యతను చటాలి: ఎమ్మెల్యే వివేక్

image

మాల, మాధిగలను వేరు చెయ్యాలని చూస్తున్నారని, మాలలు ఐక్యంగా పోరాడి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి అన్నారు. సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగిన మాలల సింహగర్జన సభకు ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు ముఖ్యనేతలు హాజరయ్యారు. మాలల ఐక్యత చాటేలా నేతలంతా ఒకే వేదికపైకి వచ్చి నినదించారు. రాష్ట్ర నలుమూలల నుంచి మాలలు భారీగా తరలివచ్చారు.