News November 29, 2024
REWIND: KCR అరెస్ట్.. NIMSలోనే దీక్ష విరమణ
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. 29 NOV 2009లో కరీంనగర్‌లోని తెలంగాణభవన్ నుంచి సిద్దిపేటలోని దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. జైలులో దీక్ష చేయగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే NIMSకు తరలించారు. DEC 9న కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రావడంతో KCR NIMSలో దీక్ష విరమించారు.
Similar News
News December 12, 2024
HYD: ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
నార్సింగి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిందని, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.
News December 11, 2024
HYD: DEC-17 నుంచి రాష్ట్రపతి శీతాకాల విడిది
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది నేపథ్యంలో హైదరాబాద్ రానున్న దృష్ట్యా జిల్లాలోని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతం సూచించారు. ఈ నెల 17 నుంచి 21 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బస చేయనున్నారని కలెక్టర్ తెలిపారు. దీనిపై అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డితో పాటు పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
News December 11, 2024
HYD: ‘రాష్ట్రాల మహాసభలను జయప్రదం చేయాలి’
DEC 14, 15 తేదీల్లో అనంతపురంలో జరిగే మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల మహాసభలను జయప్రదం చేయాలని సంస్థ రాష్ట్ర సహాయ కార్యదర్శి షేక్ అహ్మద్ కోరారు. HYDలోని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ భవనంలో మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. దేశంలో జరుగుతున్న పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించే మహాసభల్లో అందరూ పాల్గొనాలన్నారు. TPTF మాజీ రాష్ట్ర అధ్యక్షుడు B.కొండల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ఉన్నారు.