News December 30, 2024
REWIND: KNR: అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ!

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని BJP లోక్సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుంది. కరీంనగర్ లోక్సభ పరిధి నుంచి బండి సంజయ్ 2,25,209 ఓట్లు భారీ మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు పెద్దపల్లి లోక్సభ పరిధి నుంచి పోటీ చేసిన గొమాసే శ్రీనివాస్ 3,44,223 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. దీంతో లోక్సభ ఎన్నికల్లో BJPకి భారీగా ఓట్లు రావడం రాజకీయపరంగా చర్చనీయాంశంగా మారింది.
Similar News
News November 26, 2025
KNR: భారత రాజ్యాంగ దినోత్సవం సందర్బంగా ప్రతిజ్ఞ

భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులు, సిబ్బంది చేత రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశ రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు వుందని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, దేశ అభివృద్ధికి కట్టుబడి వుండాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు.
News November 26, 2025
KNR: రేపు దివ్యాంగులకు ఆటల పోటీలు

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నవంబర్ 27న (గురువారం) కరీంనగర్లోని అంబేడ్కర్ స్టేడియంలో జిల్లా స్థాయి దివ్యాంగుల ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వివిధ కేటగిరీల్లో జరిగే ఈ పోటీలకు దివ్యాంగులు సదరం, ఆధార్ కార్డులతో హాజరు కావాలని, స్వచ్ఛంద సంస్థలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె కోరారు.