News July 13, 2024
REWIND: ‘రోబో’లో మైఖేల్ జాక్సన్ పాడతానన్నారట.. కానీ!

హీరో రజినీకాంత్-డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన హిట్ మూవీ ‘రోబో’లో తమిళ సాంగ్ పాడేందుకు పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ ఒప్పుకున్నారట. అయితే కొన్నాళ్లకే ఆయన అనారోగ్యానికి గురవడంతో అది సాధ్యం కాలేదని ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ గుర్తు చేసుకున్నారు. ఆస్కార్ వచ్చినప్పుడు తాను లాస్ ఏంజెలిస్‌లో జాక్సన్‌ను కలిసి వచ్చానన్నారు. శంకర్ సూచనతో జాక్సన్‌ను సాంగ్ పాడాలని కోరగా ఆయన ఒప్పుకున్నారన్నారు.
Similar News
News December 4, 2025
మలబద్ధకాన్ని నివారించాలంటే?

* టాయిలెట్ వచ్చినప్పుడు వెంటనే వెళ్లాలి. రోజూ ఒకే సమయాన్ని అనుసరించాలి.
* సాధ్యమైనంత వరకు ఇండియన్ టాయిలెట్లను ఉపయోగించండి. వాటిని వాడటంలో సమస్యలుంటే వెస్ట్రన్ టాయిలెట్ల ముందు పీఠను ఉపయోగించి మోకాళ్లను కాస్త పైకి ఉంచుకోవాలి. ఇది మల మార్గాన్ని సులభతరం చేస్తుంది.
* 5-10 ని.ల కంటే ఎక్కువ సేపు బాత్రూమ్‌లో ఉండొద్దు.
* ఫుడ్‌లో తగినంత ఫైబర్, సరిపడినన్ని నీళ్లు తీసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి.
News December 4, 2025
పంచాయితీ చిచ్చు.. కుటుంబాలు ఛిన్నాభిన్నం

‘రూపాయి రూపాయి.. నువ్వు ఏం చేస్తావంటే హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను అని చెప్పిందట’ ఇది ఆ నలుగురు సినిమాలోని డైలాగ్. ఇప్పుడు రాజకీయమా నువ్వు ఏం చేస్తావంటే.. <<18468452>>తల్లీకూతుళ్లు<<>>, అన్నాచెల్లెళ్లు, తండ్రీకొడుకులు, బావ బావమరుదుల మధ్య చిచ్చు పెడతానని చెబుతుంది. TG పంచాయతీ ఎన్నికల్లో కనిపిస్తోన్న దృశ్యమిది. పార్టీలు, నాయకుల పంతాలతో సామాన్య కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ఈ ప్రమాదకర ధోరణిపై మీ కామెంట్
News December 4, 2025
BREAKING: సెలవుల జాబితా ప్రకటించిన ప్రభుత్వం

AP: 2026కు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 24 జనరల్ హాలిడేస్, 21 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. జనరల్ సెలవుల్లో మహాశివరాత్రి(ఫిబ్రవరి 15), బాబు జగ్జీవన్ రామ్ జయంతి(ఏప్రిల్ 5), దుర్గాష్టమి(అక్టోబర్ 18), దీపావళి(నవంబర్ 8) ఆదివారం వచ్చాయి. పైన ఫొటోల్లో సెలవుల లిస్టును చూడొచ్చు. వీటిని బట్టి మీ ట్రిప్స్‌ను ప్లాన్ చేసుకోండి.


