News December 9, 2024

REWIND: NIMS‌లో KCR దీక్ష విరమణ

image

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. 29 NOV 2009లో కరీంనగర్‌లోని తెలంగాణ‌భవన్ నుంచి సిద్దిపేటలోని దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. జైలులో దీక్ష చేయగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే NIMSకు తరలించారు. DEC 9న కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రావడంతో KCR NIMSలో దీక్ష విరమించారు.

Similar News

News December 9, 2025

గ్లోబల్ సమ్మిట్: టెక్నాలజీ గుప్పిట్లో ‘ప్రగతి’ లక్ష్యాలు!

image

TG గ్లోబల్ సమ్మిట్‌లో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (SDGs) సంచలనం సృష్టించాయి. ఫ్యూచరిస్టిక్ డోమ్‌లో ఈ 17 లక్ష్యాలను అద్భుతంగా ప్రదర్శించడం రాష్ట్ర ప్రభుత్వ ‘విజన్ 2047’కు అద్దం పట్టింది. వృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఏకకాలంలో సాగాలనే స్పష్టమైన సందేశాన్నిస్తూ, సామాజిక న్యాయం, ఆర్థికాభివృద్ధిని ముడిపెట్టే ఈ ప్రదర్శన సమ్మిట్‌కు వచ్చిన ప్రపంచ దేశాల ప్రతినిధులను ఆకర్షించింది.

News December 9, 2025

HYD: గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ సంస్కృతి, రుచులకు పెద్దపీట

image

హైదరాబాద్‌లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌లో విదేశీ అతిథులను మంత్రముగ్ధులను చేసేందుకు తెలంగాణ సంస్కృతి, రుచులకు పెద్దపీట వేశారు. శక్తివంతమైన గుస్సాడీ, బోనాలు, పేరిణి శివతాండవం వంటి నృత్యాలను ప్రదర్శిస్తున్నారు. అతిథులకు ప్రత్యేకంగా ‘తెలంగాణ మెనూ’ను సిద్ధం చేశారు. ఇందులో సకినాలు, సర్వపిండి, దమ్ బిర్యానీ, హలీమ్ వంటి సాంప్రదాయ వంటకాలు ఉన్నాయి.

News December 8, 2025

Global summit‌: ఆకాశంలో తెలంగాణ ప్రగతి చిత్రం

image

Global summit‌లో 3,000 డ్రోన్లతో కూడిన లేజర్ లైటింగ్ షో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వినోదం కోసమే కాకుండా TG అభివృద్ధి ప్రస్థానం, సాంకేతిక ఆవిష్కరణలను ప్రపంచానికి చాటిచెప్పడానికి ఉద్దేశించిన కార్యక్రమం. ఆకాశంలో తెలంగాణ చిహ్నాలు, రాష్ట్ర ప్రభుత్వ కీలక పథకాలు, పారిశ్రామిక విజయాన్ని ప్రతిబింబించే దృశ్యాలను ఆవిష్కరిస్తుంది. ‘HYD ఫార్మా హబ్’, AI సిటీ’ విజన్లను డ్రోన్ల ద్వారా 3D రూపంలో ప్రదర్శించనున్నారు.