News December 9, 2024
REWIND: NIMSలో KCR దీక్ష విరమణ

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. 29 NOV 2009లో కరీంనగర్‌లోని తెలంగాణభవన్ నుంచి సిద్దిపేటలోని దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. జైలులో దీక్ష చేయగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే NIMSకు తరలించారు. DEC 9న కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రావడంతో KCR NIMSలో దీక్ష విరమించారు.
Similar News
News July 4, 2025
బంజారాహిల్స్‌లోని వరుణ్ మోటార్స్ సీజ్

బంజారాహిల్స్ రోడ్ నం.2లోని వరుణ్ మోటార్స్‌ను GHMC అధికారులు సీజ్ చేశారు. గత రెండేళ్లుగా ట్రేడ్ లైసెన్స్ లేకుండా వరుణ్ మోటార్స్ నిర్వహకులు వ్యాపారం చేస్తుండడంతో పలుమార్లు అధికారులు నోటీసులు జారీ చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో ఇవాళ సీజ్ చేశారు. గత మూడేళ్లుగా అడ్వర్‌టైజ్మెంట్ ఫీజులు బకాయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
News May 8, 2025
ఓయూ: పరీక్షా ఫలితాలు విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంటర్వెన్షన్ పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలతో పాటు ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ కోర్సు సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవాలని సూచించారు.
News May 7, 2025
HYD: ‘కారు’లన్నీ అటువైపే!

BRS రజతోత్సవ సభ కోసం నగర శ్రేణులు సిద్ధమయ్యాయి. నియోజకవర్గం నుంచి వేలాది మంది కార్యకర్తలను తరలించేందుకు నాయకులు వాహనాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్‌ను LED లైట్లతో అందంగా అలంకరించారు. సభ వరంగల్‌లో అయినా హైదరాబాద్ కేంద్రంగా పార్టీ నేతలకు కీలక ఆదేశాలు వెళ్లాయి. బస్సులు, డీసీఎంలు, కార్లు ఘట్‌కేసర్ మీదుగా ఎల్కతుర్తి సభా ప్రాంగణానికి చేరుకోనున్నాయి. ఇందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.