News March 21, 2025

REWIND: ‘జనతా కర్ఫ్యూ’ గుర్తుందా?

image

సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదేరోజున ‘జనతా కర్ఫ్యూ’ విధించిన విషయాన్ని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. అప్పుడప్పుడే వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు దేశమంతటా స్వచ్ఛంద బంద్‌కు కేంద్రం పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దాదాపు 2 నెలల పాటు లాక్డౌన్ విధించింది. ఎక్కడికక్కడ దేశం స్తంభించడంతో వలస జీవులు ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కరోనా మీపై ఎలాంటి ప్రభావం చూపింది? COMMENT

Similar News

News November 27, 2025

8,868 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

రైల్వేలో 8,868 గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ అర్హతతో 5,810 పోస్టులు, ఇంటర్ అర్హతతో 3,058 పోస్టులు ఉన్నాయి. CBT, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్ పోస్టులకు 18-33ఏళ్లు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు 18-30ఏళ్లవారు అర్హులు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News November 27, 2025

APPLY NOW: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2700 పోస్టులు

image

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో డిగ్రీ అర్హతతో 2,700 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం అప్రెంటిస్‌లలో TGలో 154, APలో 38 ఉన్నాయి. వయసు 20-28ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. NATS/ NAPS పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్, DV, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

News November 27, 2025

ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్యంగా ఉన్నారు: పాక్ రక్షణ మంత్రి

image

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ జైలులో ఆరోగ్యంగా ఉన్నారని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ వెల్లడించారు. జైలులో 5స్టార్ హోటల్ కంటే మెరుగైన ఫుడ్ అందుతోందని, టీవీ చూసేందుకు, వ్యాయామానికి అనుమతిచ్చినట్టు చెప్పారు. నేడు, డిసెంబర్ 2న ఆయనను కలిసేందుకు కుటుంబసభ్యులకు జైలు అధికారులు అనుమతిచ్చారు. ఇమ్రాన్‌ను మరో జైలుకు తరలించారనే వార్తలను తోసిపుచ్చారు. రావల్పిండి జైలు దగ్గర ఇమ్రాన్ మద్దతుదారులు ఆందోళన విరమించారు.