News April 5, 2024

REWIND: గుడివాడలో టీడీపీకి ఆధిక్యం తెచ్చిన క్రాస్ ఓటింగ్ 

image

2019లో గుడివాడలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి అవినాశ్‌కు 70,354 ఓట్లు రాగా టీడీపీ ఎంపీ అభ్యర్థి కొనకళ్లకు 75,790ఓట్లు లభించాయి. 2019లో క్రాస్ ఓటింగ్ కారణంగా గుడివాడలో ఎంపీ అభ్యర్థి కొనకళ్లకు 751ఓట్ల ఆధిక్యం లభించింది. గుడివాడలో వైసీపీ ఎంపీ అభ్యర్థి బాలశౌరికి 75,039ఓట్లు దక్కగా, MLA అభ్యర్థి నాని 89,833ఓట్లు సాధించి అవినాశ్‌పై 19,479ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ సారి క్రాస్ ఓటింగ్ ఉంటుందా.. మీ కామెంట్ 

Similar News

News October 6, 2024

విజయవాడలో ‘జనక అయితే గనక’ స్పెషల్ షో

image

ఈ నెల 12న రిలీజ్ కానున్న ‘జనక అయితే గనక’ సినిమా స్పెషల్ షోను ఆదివారం మధ్యాహ్నం 1.30గంటలకు విజయవాడలోని రాజ్ యువరాజ్ థియేటర్‌లో ప్రదర్శించనున్నారు. సినీ హీరో సుహాస్, హీరోయిన్ సంగీర్తన, ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రేక్షకులతో కలిసి సినిమాను తిలకించనున్నారు. షో అనంతరం 3 గంటలకు చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడనున్నారు.

News October 6, 2024

కృష్ణా: దసరా ఉత్సవాల కోసం ప్రత్యేక రైళ్లు

image

దసరా ఉత్సవాల కోసం విజయవాడ(BZA) నుంచి శ్రీకాకుళం రోడ్(CHE) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 6,7,8 తేదీల్లో BZA-CHE(నం.07215) మధ్య, 7,8,9 తేదీల్లో CHE- BZA(నం.07216) మధ్య ఈ రైళ్లు నడుపుతామన్నారు. విజయవాడలో ఈ రైళ్లుపై తేదీల్లో రాత్రి 8 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 5.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటాయన్నారు.

News October 6, 2024

కృష్ణా జిల్లాలోృ 99% మేర ఈ-క్రాప్ నమోదు పూర్తి: కలెక్టర్

image

కృష్ణా జిల్లాలో 99% మేర ఈ-క్రాప్ నమోదు, 89% మేర ఈ కేవైసీ పూర్తయినట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. నూరు శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు తాము పండించిన పంటలు ఈ-క్రాప్‌లో నమోదు చేసుకుని ఈ కేవైసీ చేయడం ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందటానికి వీలవుతుందన్నారు.