News October 20, 2025

REWINED.. వరంగల్‌లో ఇదే తరహా తిరుగుబాటు..!

image

నిజామాబాద్‌లో రియాజ్‌పై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ తరహాలోనే జనగామలో కూడా ఎస్కార్ట్ పోలీసులపై తిరగబడ్డ ఐదుగురు ఉగ్రవాదులను కాల్చి చంపిన ఘటన 2015 ఏప్రిల్ 7న జరిగింది. ఐఎస్ఐ ఉగ్రవాదిగా ఉన్న వికారోద్దీన్‌ను హైదరాబాద్ కోర్టుకు తరలిస్తుండగా జనగామ ప్రాంతంలో మల విసర్జన కోసం ఆగారు. ఆ సమయంలో పోలీసులపై తిరుగుబాటు చేయడంతో కాల్పులు జరపడంతో ఐదుగురు మృతి చెందారు.

Similar News

News October 20, 2025

ములుగు: ద్రోహులకు శిక్ష తప్పదు.. ‘మావో’ లేఖ

image

మావోయిస్టు పార్టీకి మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు ముఠా వల్ల నమ్మకద్రోహం జరిగిందని మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. వీరి మాయమాటలు నమ్మి కొందరు కామ్రేడ్స్ వీరి వెంట వెళ్లారని, వారంతా జీవితాలు ప్రశాంతంగా గడపాలన్నారు. విప్లవోద్యమ నష్టానికి కారకులైన మల్లోజుల, తక్కళ్లపల్లి ముఠాలకు శిక్ష తప్పదని, అమరుల త్యాగాల సాక్షిగా శపదం చేస్తున్నామన్నారు.

News October 20, 2025

బెజ్జూర్: శ్రావణిది కుల దురహంకార హత్యే: ఏన్క అమృత

image

ఇటీవల దహేగాం మండలంలో జరిగిన గర్భిణి శ్రావణి హత్య కుల దురహంకార హత్యే అని ఆదివాసీ మహిళా సంఘం మండలాధ్యక్షురాలు ఏన్క అమృత అన్నారు. ఈరోజు బెజ్జూర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నిండు గర్భిణి అయిన ఆదివాసీ మహిళను అతి కిరాతకంగా హత్య చేసిన ఆమె మామ సత్తయ్య కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు రెండు హత్యల కేసులు నమోదు చేయాలన్నారు.

News October 20, 2025

బాసర నుంచి మాహుర్ హైవే అనుసంధానానికి రూట్ మ్యాప్

image

బాసర జ్ఞానసరస్వతి అమ్మవారి క్షేత్రం నుంచి మహుర్ రేణుకా మాత మందిరం వరకు రెండు జాతీయ రహదారుల అనుసంధానానికి రూట్ మ్యాప్ సిద్ధమైనట్లు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. జాతీయ రహదారులను అనుసంధానం చేస్తే ఆధ్యాత్మిక మార్గం ఏర్పడుతుందని ప్రస్తావించడంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారని, ఈ మేరకు సర్వే చేయాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారని చెప్పారు.