News March 26, 2025
RG-1 ఏరియాలో 103% బొగ్గు ఉత్పత్తి: GM

రామగుండం సింగరేణి సంస్థ RG-1 ఏరియా GDK-11వ బొగ్గు గనిలో 65, 100 టన్నుల బొగ్గు డిస్పాచ్ టార్గెట్ ఉండగా ఆర్థిక సంవత్సరం ఆరు రోజుల ముందుగానే 66, 901 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేశారు. ఈ సందర్భంగా 103% బొగ్గు ఉత్పత్తి జరిగిందని GMలలిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గని అధికారులను, ఉద్యోగులను GM అభినందించారు.
Similar News
News February 27, 2026
ముప్కాల్: మద్యం మత్తులో 100కు ఫోన్.. 10 రోజుల జైలు

మద్యం మత్తులో డయల్ 100కు ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తించిన రేంజర్ల గ్రామానికి చెందిన సరుగుల ప్రేమ్ కుమార్‌కు ఆర్మూర్ కోర్టు 10 రోజుల జైలు శిక్ష విధించింది. నిందితుడిని ముప్కాల్ పోలీసులు ఆర్మూర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, అత్యవసర సేవలకు ఆటంకం కలిగించినందుకు ఈ తీర్పునిచ్చినట్లు ఎస్హెచ్ఓ తెలిపారు. తప్పుడు సమాచారం లేదా అసభ్య ప్రవర్తనతో పోలీసుల సమయాన్ని వృథా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News February 27, 2026
ఎప్‌స్టీన్ ప్రకంపనలు.. దిగ్గజాల రాజీనామా

ఎప్‌స్టీన్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా దిగ్గజాలు పదవులకు రాజీనామా చేస్తున్నారు. WEF CEO బోర్జ్ బ్రెండే, హార్వర్డ్ మాజీ ప్రెసిడెంట్ లారెన్స్ సమ్మర్స్, నోబెల్ గ్రహీత రిచర్డ్ ఆక్సెల్ తమ పదవుల నుంచి వైదొలిగారు. గోల్డ్‌మన్ శాక్స్ లీగల్ ఆఫీసర్ క్యాథీ రూమ్లెర్, హయత్ హోటల్స్ వారసుడు థామస్ ప్రిట్‌జ్కర్, DP వరల్డ్ ఛైర్మన్ సుల్తాన్ అహ్మద్, నార్వే అంబాసిడర్ మోనా కూడా ఈ లిస్టులో ఉన్నారు.
News February 27, 2026
విజయవాడ: లాడ్జిలలో వ్యభిచారం

విజయవాడలోని గవర్నర్ పేటలో లాడ్జిపై పోలీసులు దాడి చేశారు. ఓ లాడ్జీలో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న స్థానికుల సమాచారం మేరకు గురువారం సాయంత్రం దాడి చేశారు. ఇద్దరు విఠులను అరెస్ట్ చేసి నలుగురు మహిళలను వ్యభిచార కూపం నుంచి విడిపించినట్లు సీఐ నాగమురళి తెలిపారు. కోర్టు ఉత్తర్వులు ప్రకారం మహిళలను సంరక్ష కేంద్రానికి పంపించామన్నారు.


