News March 26, 2025
RG-1 ఏరియాలో 103% బొగ్గు ఉత్పత్తి: GM

రామగుండం సింగరేణి సంస్థ RG-1 ఏరియా GDK-11వ బొగ్గు గనిలో 65, 100 టన్నుల బొగ్గు డిస్పాచ్ టార్గెట్ ఉండగా ఆర్థిక సంవత్సరం ఆరు రోజుల ముందుగానే 66, 901 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేశారు. ఈ సందర్భంగా 103% బొగ్గు ఉత్పత్తి జరిగిందని GMలలిత్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా గని అధికారులను, ఉద్యోగులను GM అభినందించారు.
Similar News
News January 9, 2026
హీరో నవదీప్‌పై డ్రగ్స్ కేసు కొట్టివేత

టాలీవుడ్ హీరో నవదీప్‌కు TG హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన డ్రగ్స్ కేసును న్యాయస్థానం కొట్టేసింది. నవదీప్ దగ్గర ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని పేర్కొంది. కాగా 2023లో నవదీప్‌పై డ్రగ్స్ కేసు నమోదైన విషయం తెలిసిందే. అధికారులు పలుమార్లు ఆయనను విచారించారు.
News January 9, 2026
ప్రతీ చిహ్నంపై పూజారులు, ఆదివాసీ పెద్దల అనుమతి తీసుకున్నాం: కలెక్టర్

మేడారం వనదేవతల గద్దెల ఆధునీకరణ కోసం పూజారులు, ఆదివాసీ పెద్దలతో రెండునెలల సంప్రదింపులు చేశామని కలెక్టర్ దివాకర తెలిపారు. ప్రతీ చిహ్నంపై వారి సంతకం తీసుకున్న తర్వాతనే అమలు చేశామని చెప్పారు. గొట్టు, గోత్రాలను ప్రతిబింభించేలా దేవతల గద్దెలను అభివృద్ధి చేశామన్నారు. భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
News January 9, 2026
మేడారంలో ఒకే సారి 9 వేల మందికి దర్శనం: కలెక్టర్

మేడారం వనదేవతల గద్దెలను ఒకేసారి 9 వేల మంది దర్శించుకునే వీలుందని ములుగు కలెక్టర్ దివాకర తెలిపారు. మేడారం హరిత హోటల్ ప్రాంగణంలో ఆయన మీడియాతో ముఖాముఖి నిర్వహించారు. గద్దెల అభివృద్ధి, జాతర ఏర్పాట్ల కోసం రూ.251 కోట్లను ఖర్చు చేస్తున్నామని చెప్పారు. జాతరను 8 జోన్లు, 42 సెక్టార్లుగా విభజించి 30 వేల మంది అధికారులు, ఉద్యోగులను విధుల్లో ఉంచామన్నారు. జాతర తర్వాత వారం రోజులు 6 వేల మంది పని చేస్తారన్నారు.


