News August 17, 2024
భద్రత లేదంటూ గవర్నర్‌కు RG కర్ వైద్యుల వేడుకోలు

RG కర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో దుర్మార్గాలు జరుగుతున్నాయని అక్కడి వైద్యులు బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌కు వివరించారు. తమ భద్రతపై 30-35 మందితో కూడిన బృందం ఆయన వద్ద ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరింది. బుధవారం రాత్రి విధ్వంసం జరిగాక తాము సురక్షితంగా లేమన్న భావన కలుగుతోందని ఆవేదన చెందింది. సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని గవర్నర్ వారికి హమీ ఇచ్చారు.
Similar News
News November 12, 2025
దేశవాళీ ఆడాల్సిందే.. RO-KOకు బీసీసీఐ అల్టిమేటం?

కోహ్లీ, రోహిత్ వన్డే భవిష్యత్తుపై BCCI కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వారు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని, లేదంటే జట్టులో చోటు కష్టమేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో తాను విజయ్ హజారే ట్రోఫీలో ఆడతానని హిట్‌మ్యాన్ MCAకు సమాచారం అందించినట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి. కోహ్లీ ఆడటంపై ఇంకా క్లారిటీ రాలేదు. T20, టెస్టులకు వీడ్కోలు పలికిన RO-KO వన్డేల్లో మాత్రం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
News November 12, 2025
సివిల్స్ ఫలితాలు విడుదల

ఆగస్టు 22 నుంచి 31 వరకు జరిగిన సివిల్ సర్వీసెస్(మెయిన్) ఎగ్జామినేషన్ ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. 2,736 మంది మెయిన్స్ క్లియర్ చేశారు. https://upsc.gov.in/, https://www.upsconline.gov.inలో ఎంపికైన వారి ర్యాంక్, పేర్లతో జాబితాను ఉంచారు. వీరికి పర్సనాలిటీ టెస్టు నిర్వహించి ర్యాంకుల ఆధారంగా IAS, IPS, IFS సహా పలు రకాల సెంట్రల్ సర్వీసెస్‌లు కేటాయిస్తారు.
News November 12, 2025
‘Mom my first love’.. టాటూ చూసి డెడ్‌బాడీ గుర్తింపు

ఢిల్లీ బ్లాస్ట్‌లో మరణించిన వారి డెడ్‌బాడీలను గుర్తించడం కష్టతరంగా మారింది. టాటూలు, టీ షర్టు ఆధారంగా తమ ఆత్మీయుల మృతదేహాలను గుర్తించారు. చాందినీ చౌక్‌లో ఫార్మా బిజినెస్ చేసే 34 ఏళ్ల అమర్ కటారియా బ్లాస్ట్‌లో మరణించాడు. గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న అతని డెడ్‌బాడీని చేతిపై ఉన్న ‘Mom my first love’, ‘Dad my strength’ టాటూల ఆధారంగా సోమవారం రాత్రి మార్చురీలో కుటుంబసభ్యులు గుర్తించారు.


