News January 20, 2025

RGKar Verdict: వాదనలు ప్రారంభం

image

<<15186542>>కోల్‌కతా<<>> హత్యాచార దోషి సంజయ్‌కు శిక్ష ఖరారుపై కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ కేసును దర్యాప్తు చేసిన CBI దోషికి ఉరి శిక్ష విధించాలని వాదిస్తోంది. అత్యంత క్రూర నేరానికి పాల్పడ్డ వ్యక్తికి ఇదే సరైన శిక్ష అని సీఎం మమతా బెనర్జీ సైతం కాసేపటి క్రితం కామెంట్ చేశారు. కాగా డిఫెన్స్ లాయర్ ఏం వాదించనున్నారో తెలియాల్సి ఉంది. ఈ మధ్యాహ్నం 2గం. తర్వాత తీర్పు వచ్చే అవకాశముంది.

Similar News

News November 6, 2025

‘అవిశ’ పశువులకు పోషకాలతో కూడిన మేత

image

అవిశ ఆకులు పశువులకు ముఖ్యంగా పాలిచ్చే వాటికి, మేకలకు అద్భుతమైన ఆహారమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అవిశ ఆకుల్లో 25-30 శాతం ప్రొటీన్లు ఉంటాయి. పశువులకు సులభంగా జీర్ణమయ్యే మేత ఇది. పశువులు అవిశ ఆకులను చాలా ఇష్టంగా తిని అధిక పాల దిగుబడినిస్తాయి. అవిశ పిండి(అవిశ గింజల నుంచి నూనె తీసిన తర్వాత మిగిలిన పదార్థం)ని కూడా పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. దీనిలో ప్రొటీన్లు, పోషకాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.

News November 6, 2025

TG SETకు దరఖాస్తు చేశారా?

image

అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్‌షిప్‌కు అర్హత సాధించే <>TG SE<<>>T-2025 దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. దరఖాస్తులో తప్పుల సవరణ నవంబర్ 26 నుంచి 28 వరకు చేసుకోవచ్చు. డిసెంబర్ 3న వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతారు. డిసెంబర్ రెండో వారంలో పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: http://telanganaset.org/

News November 6, 2025

పెరిగిన బంగారం, వెండి ధరలు

image

గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రా. గోల్డ్ రూ.430 పెరిగి రూ.1,21,910కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రా. పసిడి రూ.400 పెరిగి రూ.1,11,750 పలుకుతోంది. అటు కేజీ వెండి రేటు రూ.1,000 పెరిగి రూ.1,64,000గా ఉంది.