News April 16, 2025
RGM: ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించాలి: CP

నిరంతరం విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి ఎదురయ్యే ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అన్నారు. పోలీస్ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని CPప్రారంభించారు. ప్రముఖ ఆసుపత్రులకు చెందిన వైద్యులు పాల్గొని వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు. CPR చేసే విధానం గురించి సీపీ సిబ్బందికి వివరించారు.
Similar News
News December 20, 2025
మీ డబ్బు.. మీ సొంతం: కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్గొండ జిల్లాలోని బ్యాంకుల్లో సుమారు రూ.66 కోట్ల క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఉన్నాయని కలెక్టర్ ఇలా త్రిపాఠి వెల్లడించారు. ఉదయాదిత్య భవన్‌లో బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నామినీ వివరాలు లేకపోవడం, కేవైసీ అప్‌డేట్ చేయకపోవడం వల్ల ఈ నిధులు నిలిచిపోయాయని వివరించారు. ఖాతాదారులు వెంటనే తమ బ్యాంకు వివరాలు సరిచూసుకుని, నిబంధనల ప్రకారం సొంత నిధులను క్లెయిమ్ చేసుకోవాలని సూచించారు.
News December 20, 2025
Unbelievable: ఈ వెజిటెబుల్ కేజీ రూ.లక్ష

ప్రపంచంలో అత్యంత ఖరీదైన కూరల్లో హాప్ షూట్స్ ఒకటి. భారత మార్కెట్‌లో కేజీ రూ.85వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుంది. వీటిలోని హ్యుములోన్, లుపులోన్ యాసిడ్స్ క్యాన్సర్ సెల్స్‌తో పోరాడుతాయని సైంటిస్టులు చెబుతారు. TB వంటి సీరియస్ వ్యాధుల చికిత్సకూ ఉపయోగిస్తారు. బిహార్, HPలోని కొన్ని ప్రాంతాల్లో ఇవి పెరుగుతాయి. వందల హాప్ షూట్స్ కలిస్తేనే కేజీ వరకు తూగడం, పండించడంలో సవాళ్లు, కోతలో కష్టమూ భారీ ధరకు కారణాలు.
News December 20, 2025
మైనర్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు: ASF SP

ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్‌పై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని, మైనర్లు డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే కేసు నమోదు చేస్తామని ASF జిల్లా SP నితికా పంత్ తెలిపారు. వాహన యజమానులు మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ట్రాఫిక్ రూల్స్ తప్పక పాటించాలని సూచించారు.


