News February 12, 2026

RGM: క్యాంపునకు సిద్ధమైన గులాబీ పార్టీ అభ్యర్థులు

image

రామగుండం కార్పొరేషన్‌లో 59 డివిజన్లో బరిలో ఉన్న BRS పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులను క్యాంపునకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. PDPL జిల్లా పార్టీ అధ్యక్షుడు & Ex- MLA కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో గురువారం రాత్రి GDK నుంచి రెండు ప్రత్యేక బస్సులలో HYD వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. రేపు ఫలితాల వెల్లడి కానున్న నేపథ్యంలో గులాబీ పార్టీ శ్రేణులు క్యాంప్ రాజకీయాలకు తెర తీశారు.

Similar News

News March 9, 2026

చమురు భగభగ.. 120 డాలర్లకు చేరిన బ్యారెల్!

image

మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్స్‌‌తో క్రూడ్ ఆయిల్ ధర ఒక్క రోజులో 29% పెరిగింది. రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో 2022లో చివరగా ఈ రేంజ్ హైక్ నమోదైంది. UAE ముర్బాన్ క్రూడ్ బ్యారెల్ (159L) ధర $120కు, వెస్ట్ టెక్సాస్ $115, బ్రెంట్ క్రూడ్ $116కు చేరాయి. ఇరాక్, కువైట్, UAEలో చమురు ఉత్పత్తి తగ్గడంతో ధరలకు రెక్కలొచ్చాయి. ఇరాక్‌లో రోజుకు 4.3M బ్యారెల్స్‌గా ఉండే ఉత్పత్తి 1.8 మిలియన్లకు పడిపోయింది.

News March 9, 2026

పి.గన్నవరం: గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం

image

యానాం–ఎదురులంక వంతెనపై సోమవారం ఉదయం ఓ మహిళ గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే, అదే సమయంలో నదిలో చేపల వేట సాగిస్తున్న జాలర్లు ఆమె కేకలు విని అప్రమత్తమయ్యారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆమెను చాకచక్యంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. సమయస్ఫూర్తితో స్పందించి ఒక ప్రాణాన్ని నిలిపిన జాలర్లను స్థానికులు అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 9, 2026

HYD: 20 కిలోల టమాట రూ.60.. రైతుల ఆవేదన!

image

HYDలో టమాట ధరలు రోజు రోజుకు పడిపోతున్నాయి. బోయిన్‌పల్లి మార్కెట్‌లో గత 3, 4 రోజులుగా టమాట ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం 20 కిలోల టమాట క్రేట్ ధర కేవలం రూ.60 నుంచి రూ.150 మధ్య మాత్రమే పలుకుతోంది. సరఫరా ఎక్కువగా రావడం, వివాహాది శుభకార్యాలు ఇంకా మొదలవ్వకపోవడంతో వినియోగం తగ్గి ధరలు పడిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.