News April 6, 2025
RGM: ‘ఈ ఏడాది నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి సాధించాలి’

ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి- ఉత్పాదకత, ఓబి రిమూవింగ్, రవాణా నిర్విరామంగా కొనసాగాలని సింగరేణి సంస్థ డైరెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. రామగుండం సింగరేణి GM ఆసిఫ్ అలీ అన్ని విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. రక్షణతో కూడిన ఉత్పత్తి చేయాలన్నారు. అధికారులు గోపాల్ సింగ్, చంద్రశేఖర్, వెంకటేశ్వరరావు, ఆంజనేయులు, శివ నారాయణ, చిలుక శ్రీనివాస్, రమేశ్ ఉన్నారు.
Similar News
News April 7, 2025
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తిరుగు ప్రయాణం

తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతికి వచ్చిన సంజీవ్ ఖన్యా తిరుగు ప్రయాణమయ్యారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరిగి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. కలెక్టర్ వెంకటేశ్వర్, జేసీ శుభం భన్సల్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు జ్ఞాపికలను అందజేసి వీడ్కోలు పలికారు. పర్యటనకు సహకరించిన జిల్లా అధికార యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News April 7, 2025
GNT: శునకం దాడిలో చిన్నారి మృతిపై మంత్రి దుర్గేశ్ విచారం

గుంటూరులోని స్వర్ణభారతినగర్‌లో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన ఘటనపై మంత్రి కందుల దుర్గేశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్న ఆయన, బాలుడి కుటుంబానికి ప్రభుత్వ పరంగా అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు. ఇలాంటి విషాద ఘటనలు మళ్లీ జరుగకుండా కుక్కల నియంత్రణపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
News April 7, 2025
MTM: రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

మచిలీపట్నం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని డివిజన్, మండల కేంద్రాల్లో, మునిసిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు ఆయా కార్యాలయాలలో అర్జీలు ఇవ్వవచ్చన్నారు.