News January 26, 2026
RGM: ఎన్నికల వేడి.. నామినేషన్ల ముందే ప్రచారం జోరు

పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభం కాకముందే పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులు తమ డివిజన్‌లో ప్రచారం ముమ్మరం చేశారు. వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రజలను కలిసి ప్రజా సమస్యలపై అవగాహన కల్పించి, తమను గెలిపించాలని కోరుతున్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలుకాకముందే రామగుండంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది.
Similar News
News February 3, 2026
US-భారత్ ట్రేడ్ డీల్.. కేంద్రం క్లారిటీ

అమెరికాతో ట్రేడ్ డీల్ నుంచి కీలక రంగాలైన వ్యవసాయ, డెయిరీ ఉత్పత్తులను కేంద్రం మినహాయించనున్నట్లు తెలుస్తోంది. రైతుల విషయంలో రాజీ పడేది లేదని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్ ఒత్తిడితోనే భారత్ వెనిజులా ఆయిల్ కొనేందుకు అంగీకరించిందన్న వార్తను తోసిపుచ్చాయి. గతంలో ఆ దేశంపై ఆంక్షలు ఉండటం వల్లే ఆయిల్ కొనలేదని, ఇప్పుడు అవి లేనందున కొనుగోలుకు సిద్ధపడుతున్నట్లు తెలిపాయి.
News February 3, 2026
జహీరాబాద్‌లో ఘోరం.. కడుపులో దిగిన చువ్వలు

జహీరాబాద్‌లోని ఆదర్శనగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి పడి రాజు (50) అనే కూలీకి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదవశాత్తు కింద పడటంతో ఇనుప చువ్వలు కడుపులోకి గుచ్చుకున్నాయి. రంజోల్‌కు చెందిన రాజును 108 సిబ్బంది చాకచక్యంగా రక్షించారు. చువ్వలను కత్తిరించి, ప్రథమ చికిత్స అందిస్తూ జహీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమయానికి స్పందించిన ఈఎంటీ సంగమేశ్వర్, పైలట్ శ్రీనివాస్‌ను స్థానికులు అభినందించారు.
News February 3, 2026
BREAKING.. కాకాణికి నోటీసులు

మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసు అధికారులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు, సోమిరెడ్డిపై కాకాణి గోవర్ధన్ రెడ్డి దుర్బషలాడారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై నెల్లూరు రూరల్, పొదలకూరు, మనుబోలులో కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు అందజేశారు.


