News April 3, 2025
RGM: కమిషనరేట్ పరిధిలో నెలపాటు నిషేధాజ్ఞలు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలో నెల పాటు నిషేధాజ్ఞలు విధించినట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రకటనలో తెలిపారు. అనుమతి లేని డ్రోన్లు, DJసాండ్స్ పై చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యంతాగి ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకో, సభలు, సమావేశాలు నిర్వహించకూడదన్నారు.
Similar News
News April 3, 2025
రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. ఆదిలాబాద్, HYD, VKB, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, కర్నూలు, కడప, చిత్తూరు సహా మరికొన్ని జిల్లాల్లో పడిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. రేపు, ఎల్లుండి కూడా <<15974523>>వర్షాలు <<>>కురుస్తాయన్న హెచ్చరికలతో స్కూళ్లకు వెళ్లడం ఇబ్బంది అవుతుందని, సెలవు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. మీ ప్రాంతంలో వర్షం పడుతుందా? కామెంట్ చేయండి.
News April 3, 2025
కంచ భూముల వివాదంపై కమిటీ ఏర్పాటు

TG: గచ్చిబౌలి కంచ భూముల వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ఈ కమిటీలో చోటు కల్పించింది. HCU, విద్యార్థులు, ప్రజాసంఘాలతో ఈ కమిటీ సంప్రదింపులు జరపనుంది. కాగా భూముల్లో జరుగుతున్న పనులను తక్షణం నిలిపివేయాలని ఇవాళ సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
News April 3, 2025
ATP: పాఠశాలల పునఃవ్యవస్థీకరణ పూర్తి కావాలి- కలెక్టర్

ప్రభుత్వం 117 జీఓను ఉపసంహరించుకున్న నేపథ్యంలో పాఠశాలల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అనంతపురం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్‌లో మండల విద్యాశాఖ అధికారులతో పాఠశాలలు పునఃవ్యవస్థీకరణ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. పాఠశాలల పునఃవ్యవస్థీకరణ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలన్నారు.