News September 24, 2025
RGM: ‘కాంట్రాక్టు కార్మికులకు 15% వాటా ఇవ్వాలి’

సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సంస్థ సాధించిన లాభాలలో 15% వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. IFTU ఆధ్వర్యంలో రామగుండం డివిజన్‌లోని వివిధ డిపార్ట్మెంట్ లపై కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి బుధవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు ఈ నరేష్, రాజేశం మాట్లాడారు. సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలన్నారు. రాజేందర్, కిష్టయ్య, రాజు, కృష్ణ పాల్గొన్నారు.
Similar News
News September 24, 2025
ఎమర్జెన్సీ నంబర్లు.. సేవ్ చేసుకోండి

అత్యవసర సమయంలో కింది ఎమర్జెన్సీ నంబర్లకు ఫోన్ చేసి ప్రాణాలు కాపాడుకోవచ్చు.
*112- అన్ని అత్యవసర పరిస్థితుల్లో దీనికి కాల్ చేయవచ్చు. (పోలీసులు, అంబులెన్స్, ఫైరింజన్)
*100- పోలీసులు
*101- అగ్నిప్రమాదాలు, గ్యాస్ లీక్
*102- గర్భిణులు, పిల్లలకు ఫ్రీ అంబులెన్స్ *108- మెడికల్ ఎమర్జెన్సీ *1091- మహిళల వేధింపులకు హెల్ప్ లైన్ *1930- డిజిటల్ మోసాలను రిపోర్ట్ చేయవచ్చు
News September 24, 2025
పహల్గాం ఉగ్రదాడి.. టెర్రరిస్టులకు సహకరించిన వ్యక్తి అరెస్ట్!

పహల్గాం ఉగ్రదాడిలో టెర్రరిస్టులకు సాయం చేసినట్లు భావిస్తున్న ఓ వ్యక్తిని J&K పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఆపరేషన్ మహదేవ్‌లో ఇటీవల పలువురు టెర్రరిస్టులను సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఘటనాస్థలిలో సేకరించిన ఫోరెన్సిక్ ఆధారాలను బేస్ చేసుకొని మహ్మద్ కటారియా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల కదలికలను కనిపెట్టేందుకు ఇతడి అరెస్టు కీలకమని పోలీసులు భావిస్తున్నారు.
News September 24, 2025
తిరుపతిలో నిజామాబాద్ యువకుడి హత్య..?

తిరుపతి రిలయన్స్ ఓవర్ బ్రిడ్జి కింద రైల్వే ట్రాక్ పక్కన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతణ్ని నిజామాబాద్ జిల్లా రాజంపేటకు చెందిన సతీష్ కుమార్ (32)గా గుర్తించారు. మద్యం బాటిల్ పగలగొట్టి గొంతు కోసి హత్య చేశారని సమాచారం. ఈ ఘటనపై జీఆర్‌పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.