News April 5, 2025

RGM: కానిస్టేబుల్ నుంచి పంచాయతీరాజ్ AE

image

రామగుండం NTPCపోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న తూర్పాటి సాయిలత పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్‌లో AEగా ఉద్యోగం సాధించింది. ఈ సందర్భంగా విధుల నుంచి రిలీవ్ అయి వెళ్తున్న సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో SIలు ఉదయ్ కిరణ్, మానస పోలీసు సిబ్బంది ఆమెను ఘనంగా సత్కరించారు. గతేడాది కానిస్టేబుల్‌గా బాధ్యతలు స్వీకరించిన సాయిలత అనతి కాలంలో AEగా ఉద్యోగ సాధించడం పట్ల అభినందించారు.

Similar News

News March 1, 2026

సంక్రాంతి తర్వాత డల్ టాలీవుడ్ డల్

image

సంక్రాంతికి కళకళలాడిన టాలీవుడ్ బాక్సాఫీసు ఆ తర్వాత డల్ అయింది. పండగ తర్వాత రిలీజైన తెలుగు సినిమాలు ఆ రేంజ్ ఆదరణ దక్కించుకోలేకపోయాయి. గత నెలరోజుల్లో రిలీజైన 10 సినిమాల్లో ఏ ఒక్కటీ మంచి కలెక్షన్స్ రాబట్టుకోలేకపోయింది. పెద్ద సినిమాలు లేకపోవడం, టికెట్ ధరలు, ఓటీటీలకు ఆడియన్స్ ప్రాధాన్యం ఇవ్వడం మొదలైనవి కారణాలుగా తెలుస్తోంది. అయితే ఈనెల, ఏప్రిల్‌లో బడా సినిమాల రిలీజ్‌తో పరిస్థితి మారే అవకాశం ఉంది.

News March 1, 2026

నిజామాబాద్: జిల్లా ప్రజలకు సీపీ కీలక సూచనలు

image

నిజామాబాద్ జిల్లా ప్రజలకు సీపీ సాయిచైతన్య కీలక సూచనలు చేశారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్ఠలు నిషేధించినట్లు చెప్పారు. రాత్రి 10 గం.ల నుంచి ఉదయం 6 గం.ల వరకు డీజేలు వాడకూడదన్నారు. భారీ సభలకు, డ్రోన్ల వినియోగానికి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఈ నిబంధనలు మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు అమలులో ఉంటాయన్నారు.

News March 1, 2026

నేడు విండీస్‌తో ఢీ.. ఈ’డెన్’ కలిసొస్తుందా?

image

T20WC: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నేడు భారత్-విండీస్ తలపడనున్నాయి. సెమీస్ చేరాలంటే భారత్ తప్పక గెలవాల్సిన మ్యాచ్ ఇది. అయితే 1983 నుంచి ఈడెన్‌లో భారత్‌ను విండీస్ ఎప్పుడూ ఓడించలేకపోయింది. భారత్ చేతిలో నాలుగు T20I సహా తొమ్మిది మ్యాచ్‌లు ఓడిపోగా మరో రెండు డ్రా అయ్యాయి. ఇక 2016 టీ20 ప్రపంచకప్ తర్వాత విండీస్ ఎప్పుడూ సెమీస్ చేరలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.