News September 9, 2025
RGM: పోలీస్ అధికారులపై విచారణ

పోలీసు అధికారుల పనితీరుపై రామగుండం పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. DJ సౌండ్స్ విషయంలో ఒకరిని, చోరీ విషయంలో మరొకరిని బెదిరింపులకు గురిచేసిన బసంత్ నగర్ SI, గణేష్ నిమజ్జనం రోజున ఓ డ్రైవర్‌పై దురుసుగా ప్రవర్తించిన చెన్నూరు రూరల్ CIలపై ఎంక్వైరీపై CP అంబర్ కిషోర్ ఝా ప్రత్యేకంగా దృష్టి సారించారు.
Similar News
News September 9, 2025
మూడు రోజులు భారీ వర్షాలు

AP: ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న మూడ్రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అల్లూరి, ఏలూరు, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగతా చోట్ల తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది. ఎల్లుండి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించింది.
News September 9, 2025
గద్దెల మార్పు నిర్ణయంతో ప్రభుత్వానికి సంబంధం లేదు: మేడారం పూజారులు

TG: మేడారంలో గోవింద రాజు, పగిడిద్ద రాజు గద్దెల మార్పు అంశంతో ప్రభుత్వానికి, మంత్రులు సీతక్క, సురేఖకు ఎలాంటి సంబంధం లేదని పూజారుల సంఘం ప్రకటించింది. గోవిందరాజు, పగిడిద్దరాజుల మూలాలను ముట్టుకోకుండా ఈ మార్పు జరుగుతుందని పేర్కొంది. భక్తుల సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది. కాగా దేవతల గద్దెలు ఒక్కో దిక్కున ఉండటంతో ఇబ్బందులు కలుగుతున్నాయని, అందుకే మార్పులు చేస్తున్నట్లు తెలిపింది.
News September 9, 2025
జగిత్యాల: జిల్లాలో 5వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు

జగిత్యాల జిల్లాలో ఇప్పటివరకు 5వేల ఎకరాల్లో రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి శ్యాం ప్రసాద్ తెలిపారు. కొడిమ్యాల మండలం పూడూర్లో ఆయిల్ పామ్ సాగు పద్ధతులపై, తోటల యాజమాన్యంపై ఉద్యాన శాఖ ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ సదుపాయాల గురించి రైతులకు మంగళవారం అవగాహన కల్పించారు. అనంతరం ఆయిల్ పామ్ తోటలను సందర్శించారు. జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ తదితరులు ఉన్నారు.