News September 17, 2025
RGM: పోలీస్ కమిషనరేట్ లో ప్రజా పాలన దినోత్సవం

రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో బుధవారం ప్రజా పాలన దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పాల్గొని జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం అధికారులు, సిబ్బందితో కలిసి జాతీయ గీతం, రాష్ట్ర గీతం ఆలపించారు. గోదావరిఖని ACPలు మడత రమేష్, శ్రీనివాస్, ప్రతాప్, శ్రీనివాస్, రామమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 17, 2025
‘పార్వతీపురం జిల్లాలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు’

జిల్లాలో బలహీన వర్గాలు మరియు మధ్యతరగతి కుటుంబాల అవసరాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ డాక్టర్ పి.ధర్మచంద్రారెడ్డి అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ పిజిఆర్ఎస్ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం అంగీకార అమలుపై అవగాహనా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ విధానంపై ప్రతి ఒక్కరు చైతన్యవంతులు కావాలని పేర్కొన్నారు.
News September 17, 2025
విశాఖలో గూగుల్ డేటా సెంటర్: సీఎం చంద్రబాబు

AP: విశాఖకు గూగుల్ డేటా సెంటర్ రాబోతోందని, త్వరలో దీనిపై ప్రకటన వస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖలో జరుగుతోన్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్‌లో ఆయన ప్రసంగించారు. ‘విశాఖలో అద్భుతమైన వాతావరణం ఉంది. శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నాయి. మహిళల భద్రతలో అగ్రస్థానంలో ఉంది’ అని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ భారత్‌కు అతిపెద్ద ఆస్తి అని కొనియాడారు. దేశానికి ఆయనే సరైన నాయకుడని పేర్కొన్నారు.
News September 17, 2025
చందన్ వల్లి-కొడంగల్ రేడియల్ రోడ్డు: CM

ఔటర్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రోడ్డు మధ్యలో కొత్తగా రేడియల్ రోడ్లు వేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. విస్తరణలో ప్రజలకు, రైతులకు నష్టం జరగకుండా రేడియల్ రోడ్ల నిర్మాణం ఉంటుందని తెలిపారు. పరిశ్రమల కల్పవల్లి రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్ వల్లి నుంచి కొడంగల్ వరకు 70 కిలోమీటర్ల రేడియల్ రోడ్డు నిర్మాణం త్వరలో చేపడతామని ప్రజాపాలన వేడుకల్లో సీఎం వెల్లడించారు.