News January 24, 2026
RGM: సమ్మక్క జాతర ప్రదేశాన్ని పరిశీలించిన సీపీ

గోదావరిఖని సమ్మక్క జాతర ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పేర్కొన్నారు. గోదావరి బ్రిడ్జి సమీపంలోని సమ్మక్క జాతర ప్రదేశాన్ని శనివారం పోలీసు అధికారులతో కలిసి ఆయన సందర్శించారు. జాతర పరిసరాలను పరిశీలించారు. భక్తుల భద్రత, రక్షణ, ట్రాఫిక్ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News April 14, 2026
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి: కలెక్టర్

పుట్టపర్తిలోని ఆర్వీ జానకి రామయ్య కళ్యాణ మండపంలో మంగళవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరై అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన చూపిన మార్గంలో నడవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. అధికారులు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
News April 14, 2026
మెదక్: రోడ్డు భద్రతపై కలెక్టర్ ప్రతిమా సింగ్ ప్రతిజ్ఞ

అతివేగం, నిర్లక్ష్యంతో వాహనాలు నడిపి విలువైన ప్రాణాలను బలి తీసుకోవద్దని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో అంబేద్కర్ జయంతి సందర్భంగా రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, ఆటో డ్రైవర్లు, విద్యార్థులతో కలిసి ఆమె ప్రతిజ్ఞ చేయించారు. అక్కడ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ప్రారంభించారు.
News April 14, 2026
అమర జవాన్‌కు కలెక్టర్ నివాళి

గోరంట్ల మండలం తల్లి తండాకు చెందిన అమర జవాన్ మురళి నాయక్ వర్ధంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆయన సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. మురళి నాయక్ వంటి వీరులు జిల్లాకే గర్వకారణమని కలెక్టర్ కొనియాడారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన జవాన్ స్ఫూర్తిని యువత కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.


