News April 11, 2025

RGM: సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మకండి: ACP

image

రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో భూకంప వస్తుందనే వదంతులు ప్రజలు నమ్మవద్దని గోదావరిఖని ACPమడత రమేష్ పేర్కొన్నారు. రామగుండం పరిధిలో భూకంపం ప్రమాదం లేదని, ఇక్కడి జనాలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని సూచించారు. ఈనెల 10 నుంచి 17 వరకు భూకంపం వస్తుందని సోషల్ మీడియా, వాట్సాప్‌లో వచ్చే సంఘటనలు ప్రజలు నమ్మవద్దన్నారు.

Similar News

News April 18, 2025

సిద్దిపేట: కరెంట్ షాక్‌తో బాలుడి మృతి

image

ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి ఆరో తరగతి విద్యార్ధి సాయి ప్రణీత్(12) మృతి చెందిన ఘటన తోగుట మండలం తుక్కాపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామంలోని దేవాలయంలో జరిగే ఉత్సవాలకు ఏర్పాటు చేసిన విద్యుత్ పోల్‌ను అనుకోకుండా తగలడంతో సాయి ప్రణీత్ అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తండ్రి స్వామి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News April 18, 2025

త్వరలో అంతరిక్ష కేంద్రానికి భారత వ్యోమగామి

image

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(IAF) గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా మేలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ISS)కు వెళ్లనున్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. నాసా అనుమతి పొందిన ప్రైవేట్ స్పేస్‌ఫ్లైట్‌లో ఆయన ప్రయాణించనున్నారు. గత 40 ఏళ్లలో స్పేస్‌లోకి వెళ్లిన తొలి ఇండియన్‌గా శుక్లా నిలవనున్నారు. 1984లో తొలిసారి రాకేశ్‌శర్మ స్పేస్‌లోకి వెళ్లారు. ఈ మిషన్ ఇస్రో, నాసా భాగస్వామ్యంలో కీలకంగా మారనుంది.

News April 18, 2025

నల్గొండ: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి అప్పగింత

image

మనస్తాపంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన యువతి తిరిగిరావడంతో ఆమెను పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోసారి ఇలాంటి పొరపాటు చేయవద్దని తల్లీ కూతుర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించినట్లు 2 టౌన్ ఎస్ఐ సైదులు తెలిపారు. నల్గొండ శివాజీ నగర్ ఏరియాలోని ఎన్జీ కాలనీకి చెందిన ఓ యువతి ఉద్యోగం చేయడానికి కుటుంబ సభ్యులు నిరాకరిస్తే మనస్తాపం చెంది మార్చి 1న ఇంటి నుంచి వెళ్లిపోయింది. పోలీసులు ఆమెను తిరిగి అప్పగించారు.

error: Content is protected !!