News October 27, 2025
RGM: 1,000 మంది విద్యార్థులతో ఓపెన్ హౌస్..!

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రారంభించిన ఈ కార్యక్రమంలో సుమారు 1,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పోలీస్ విధులు, షీ టీమ్స్, భరోసా, సైబర్ నేరాల నివారణ, ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించారు. డాగ్ స్క్వాడ్ ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది. సైబర్ మోసాల నుంచి జాగ్రత్తగా ఉండాలని సీపీ సూచించారు.
Similar News
News October 27, 2025
నవీన్ యాదవ్ తండ్రి సహా 170 మంది రౌడీషీటర్ల బైండోవర్

TG: ఈసీ ఆదేశాలతో జూబ్లీహిల్స్‌లో 170 మంది రౌడీషీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు. ఈ జాబితాలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్, సోదరుడు రమేశ్ యాదవ్ ఉన్నారు. నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పలువురు రౌడీ షీటర్లు పాల్గొన్న నేపథ్యంలో ఈసీ చర్యలకు దిగింది. ఎన్నికల వేళ కేసులు నమోదయితే కఠిన చర్యలు తీసుకోనుంది.
News October 27, 2025
NZB: లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు

NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ వైన్ షాపుల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించారు. జిల్లాలోని 102 మద్యం షాపులకు గాను మొత్తం 2786 దరఖాస్తులు దాఖలవగా ఒక్కో దరఖాస్తుకు సంబంధించిన వారిని ఆహ్వానిస్తూ, వారి సమక్షంలో కలెక్టర్ లక్కీ డ్రా తీస్తూ మద్యం దుకాణాల కేటాయింపును ఖరారు చేశారు. ఎక్సైజ్ DC వి.సోమిరెడ్డి పాల్గొన్నారు.
News October 27, 2025
VZM: జర్మనీలో ఉద్యోగాలకు 30న జాబ్ మేళా

విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి జి.ప్రశాంత్ కుమార్ తెలిపారు. జర్మనీలో ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో 2 సంవత్సరాల అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం అక్టోబర్ 30న విజయనగరం గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.2.60 లక్షల వరకు టాక్స్ ఫ్రీ వేతనం, ఉచిత వసతి, వైద్యం, రవాణా సదుపాయం కల్పించబడుతుందని ఆయన తెలిపారు.


