News October 16, 2025
RGM: 21 నుంచి పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు

ఈనెల 21 నుంచి 31 వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రామగుండం CP అంబర్ కిషోర్ ఝా గురువారం ప్రకటనలో తెలిపారు. ఓపెన్ హౌస్ కార్యక్రమం, రక్తదాన శిబిరం, సైకిల్ ర్యాలీ, షార్ట్ ఫిలిం, ఫొటోగ్రఫీ పోటీలను నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. పోలీసు అమరులను స్మరిస్తూ కళా ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల- పెద్దపల్లి జిల్లాలలో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
Similar News
News October 16, 2025
ములుగు: దామోదరన్న లొంగిపోతారా?

మావోయిస్టు పార్టీలో సుదీర్ఘంగా కీలక నేతలుగా ఉన్న ఒక్కొక్కరు లొంగిపోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లికి చెందిన బడే చొక్కారావు@ దామోదర్ లొంగిపోతారా? పార్టీలో కొనసాగుతారా? అనే చర్చ జరుగుతోంది. 30 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న దామోదర్.. సభ్యుడు, దళ కమాండర్, కేకేడబ్ల్యూగా ఎదిగి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యత వహిస్తున్నారు.
News October 16, 2025
‘ఓటుకు నోటు’ కేసు విచారణ వాయిదా

‘ఓటుకు నోటు‘ కేసు నిందితులు రేవంత్, సండ్ర వెంకట వీరయ్య పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు నవంబర్ 3కి వాయిదా వేసింది. రేవంత్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసు చట్టవిరుద్ధమని నిన్న ఆయన తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ పేర్కొన్నారు. ఏసీబీ చట్టం ప్రకారం లంచం తీసుకోవడమే నేరమని వాదించారు. గురువారం కూడా వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది. న్యాయమూర్తులు మహేశ్వరి, విజయ్ బిష్ణోయ్ కేసు విచారించారు.
News October 16, 2025
విద్యార్థుల సమగ్రాభివృద్ధే లక్ష్యం: భద్రాద్రి కలెక్టర్

జిల్లాలో గిరిజన విద్యార్థుల సమగ్ర అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక వసతుల అభివృద్ధి ప్రధాన లక్ష్యమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. గురువారం పాల్వంచలోని కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల(బాలుర)ను సందర్శించిన ఆయన, పాఠశాల విద్యా కార్యక్రమాలు, వసతుల పరిస్థితి, విద్యార్థుల సౌకర్యాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఖాళీగా ఉన్న భూమిని కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు.