News April 1, 2025
RGM: GDK-11వ గని బొగ్గు ఉత్పత్తిలో టాప్

రామగుండం సింగరేణి సంస్థ GDK-11వ గనిలో మార్చిలో నిర్దేశించిన 69,600 టన్నుల బొగ్గు ఉత్పత్తికి గాను ఒకరోజు ముందుగానే 71,893 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసిందని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా GM లలిత్ కుమార్ అభినందించారు. అలాగే RG- 3 CHPలో ఉత్పత్తి అయిన 30,839 టన్నుల బొగ్గును ఒక రోజులో 15 రైల్వే రేకుల ద్వారా NTPC విద్యుత్ పరిశ్రమకు రవాణా చేసిందని అధికారులు పేర్కొన్నారు.
Similar News
News December 3, 2025
సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్

TG: తరం మారింది. తలరాతలు మార్చే ప్రచార వేదికలూ మారుతున్నాయి. ప్రతి ఒక్కరి చేతుల్లోని స్మార్ట్ ఫోన్ను చేరేలా పంచాయతీ అభ్యర్థుల ప్రచారం సాగుతోంది. దీంతో గోడలపై, ఇళ్లకు పోస్టర్లు, మైకుల సందడికి సోషల్ మీడియా అదనంగా చేరింది. రెగ్యులర్ ఆఫ్లైన్ క్యాంపెయిన్లతో పాటు వాట్సాప్లో వీడియోలతోనూ ఓటు అభ్యర్థిస్తున్నారు. ఊరి వాట్సాప్ గ్రూప్స్లో డిస్కషన్స్ పోల్స్ రిజల్ట్ను బట్టి హామీలు, వ్యూహాలూ మారుతున్నాయి.
News December 3, 2025
అమరావతి: సచివాలయంలో బారికేడ్ల తొలగింపు

అమరావతి సచివాలయంలో ఇనుప బారికేడ్లను తొలగించారు. బారికేడ్ల వల్ల ప్రజలు, సందర్శకులు ఇబ్బంది పడుతున్నారని గమనించిన సీఎం చంద్రబాబు.. వెంటనే వాటిని తొలగించాలని పోలీసులను ఆదేశించారు. బ్లాకుల ముందు బారికేడ్లకు బదులుగా పూల కుండీలు ఏర్పాటు చేయాలని సూచించారు. దీంతో అధికారులు యుద్ధప్రాతిపదికన బారికేడ్లను తొలగించి, ఆ స్థానంలో అందమైన క్రోటాన్, పూల మొక్కలను ఏర్పాటు చేశారు.
News December 3, 2025
మహబూబాబాద్: నేడు మూడో దశ నామినేషన్లు

జిల్లాలో మూడో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ బుధవారం జరగనుంది. కురవి, కొత్తగూడ, మరిపెడ, గంగారం, డోర్నకల్, సీరోల్ మండలాల్లోని 169 సర్పంచ్ స్థానాలకు, 1,412 వార్డు మెంబర్ స్థానాలకు నామినేషన్లను అధికారులు స్వీకరించనున్నారు.


