News April 2, 2025

RGM: NTPC విద్యుత్ పరిశ్రమలో 15, 037M.Uప్రొడక్షన్

image

రామగుండం NTPCవిద్యుత్ పరిశ్రమలో గత ఆర్థిక సంవత్సరంలో 15,037 మిలియన్ యూనిట్ల(MU) విద్యుత్ ఉత్పత్తి సాధించినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. 500 మెగావాట్ల 4వ యూనిట్లో 280 రోజులలో విద్యుత్ ఉత్పత్తి చేపట్టి రికార్డు సృష్టించిందన్నారు. 200 మెగావాట్ల 3వ యూనిట్‌లో వంద రోజులపాటు పనిచేసి అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసిందన్నారు. 62% శాతం PLFనమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

Similar News

News July 7, 2025

వరంగల్: అప్పుల ఊబిలో గ్రామ పంచాయతీలు..!

image

జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామ పంచాయతీలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. జిల్లాలో 13 మండలాలు ఉండగా ఇందులో 325 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఏడాదిన్నరకు పైగా గ్రామాల్లో ప్రత్యేక పాలనే నడుస్తోంది. దీంతో కార్యదర్శులు అన్నీ తామై అప్పులు తెచ్చి పెట్టుబడి పెడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన నిధులు సకాలంలో రాకపోవడంతో ఒక్కో కార్యదర్శి దాదాపు రూ.2 లక్షలకు పైగా అప్పు చేశామని వాపోతున్నారు.

News July 7, 2025

నూజివీడు: అధికారులపై సబ్ కలెక్టర్ ఆగ్రహం

image

నూజివీడు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం నేడు జరిగింది. సకాలంలో అన్ని శాఖల అధికారులు హాజరు కాకపోవడంతో సబ్ కలెక్టర్ స్మరణ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్యక్రమం ఏర్పాటు చేస్తే అధికారులు సరైన సమయానికి రాలేదు. ఇలాంటి ఘటనలు పునారవృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News July 7, 2025

VR స్కూల్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్

image

నెల్లూరులోని VR మున్సిపల్ స్కూల్‌ను విద్యాశాఖ మంత్రి లోకేశ్ సోమవారం ప్రారంభించారు. ఎంతో చరిత్ర గల ఈ పాఠశాలను ఇటీవల మంత్రి నారాయణ పున:నిర్మించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లోకేశ్ పాఠశాలలో మౌలిక వసతులను పరిశీలించారు. పలువురు విద్యార్థులతో సెల్ఫీలు దిగారు. ఈ పాఠశాల పున:నిర్మాణంలో నారాయణ కూతురు షరిణి కీలక పాత్ర పోషించారు. మంత్రి వెంట ఎంపీ వేమిరెడ్డి, కలెక్టర్ ఆనంద్ తదితరులు ఉన్నారు.