News November 17, 2025

RGNIYDలో ఉద్యోగాలు

image

రాజీవ్ గాంధీ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్‌ (<>RGNIYD<<>>) 6 టీచింగ్ & నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 15లోపు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ, M.Lib.sc, B.Lib.sc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాతపరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.rgniyd.gov.in/

Similar News

News March 4, 2026

ఇరాన్‌పై 3 డేంజరస్ బాంబర్లతో US దాడి

image

ఇరాన్‌పై అమెరికా 3 భారీ బాంబర్లను ఉపయోగించింది. అవి B-52 స్ట్రాటోఫోర్ట్రెస్, B-1 లాన్సర్, B-2 స్పిరిట్. B-52 స్ట్రాటోఫోర్ట్రెస్ 31వేల KGల బరువైన బాంబులను మోసుకెళ్తుంది. B-1 లాన్సర్ సూపర్‌సోనిక్, ఫాస్టెస్ట్ బాంబర్. ఇది 35వేల కేజీల బాంబులను శత్రు స్థావరాలపై వేస్తుంది. ఇక B-2 స్పిరిట్ మోస్ట్ డేంజరస్. రాడార్లకు చిక్కకుండా 50వేల అడుగుల ఎత్తుపై నుంచి బాంబులను వదులుతుంది. దీని ధర దాదాపు ₹20వేల కోట్లు.

News March 4, 2026

ఇరాన్ పోరాటం వెనుక చైనా బలం!

image

US-ఇజ్రాయెల్‌కు ఇరాన్ దీటుగా బదులిస్తోంది. వాటిని టార్గెట్ చేస్తూనే UAE, ఒమన్, సౌదీ సహా 11 దేశాలపై విరుచుకుపడుతోంది. ఇరాన్ పోరాటానికి రహస్యంగా చైనా సాయపడిందని అంతర్జాతీయ కథనాలు వెల్లడిస్తున్నాయి. డ్రోన్లు, క్షిపణులు, ఇతర అత్యాధునిక వెపన్స్‌‌తోపాటు కీలక సాంకేతికతను సరఫరా చేసిందని చెబుతున్నాయి. చైనా అండ లేకపోతే ఇరాన్ నిలబడేది కాదంటున్నాయి. శత్రువులపై కచ్చితత్వంతో చేస్తున్న దాడులను ఉదహరిస్తున్నాయి.

News March 4, 2026

అల్లు ఫ్యామిలీని చూశారా?

image

అల్లు శిరీష్, నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన వారందరికీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ‘అందమైన జంటపై ఆశీస్సులు కురిపించారు. ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు పంపారు. మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయి. మీ ప్రేమ, ఆప్యాయతకు థాంక్స్’ అని ట్వీట్ చేశారు. ఈ నెల 2న అల్లు స్టూడియోస్‌లో శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.