News February 10, 2025
విచారణకు RGV గైర్హాజరు.. రేపు మళ్లీ నోటీసులు?

AP: గుంటూరు సీఐడీ విచారణకు నేడు డైరెక్టర్ RGV గైర్హాజరయ్యారు. దీంతో రేపు మళ్లీ నోటీసులివ్వాలని పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తాను సినిమా ప్రమోషన్లో ఉన్నందున విచారణకు రాలేనని RGV 8 వారాల సమయం కోరారు. ఈ క్రమంలో ఆయన తరఫున న్యాయవాదిని CID కార్యాలయానికి పంపారు. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమాపై TDP నేతల ఫిర్యాదు మేరకు CID ఆర్జీవీకి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News November 19, 2025
ధనుష్ పేరిట కమిట్మెంటు అడిగారు: మాన్య

హీరో ధనుష్ పేరిట కమిట్మెంటు అడిగారని తమిళ నటి మాన్య ఆనంద్ ఆరోపించారు. ధనుష్ నిర్మించే సినిమాలో నటించేందుకు శ్రేయస్ అనే వ్యక్తి కాల్ చేశాడన్నారు. ధనుష్ కోసమంటూ కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పాడన్నారు. స్క్రిప్ట్, ప్రొడక్షన్ హౌస్ లొకేషన్ పంపగా నంబర్ను బ్లాక్ చేశానని చెప్పారు. దీనిపై ధనుష్ టీమ్ స్పందిస్తూ మేనేజర్ పేరిట ఎవరో అమ్మాయిల్నిబ్లాక్మెయిల్ చేస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపింది.
News November 19, 2025
రాష్ట్రంలో 324 ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

TG: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న 324 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని ఈవోలకు దేవదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఈవోలు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే ఆలయాల వారీగా రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్లు వెలువడనున్నాయి.
News November 19, 2025
హిందూ మహిళలకు సుప్రీంకోర్టు కీలక సూచన

మరణానంతరం తన ఆస్తిని ఎవరికి పంచాలో హిందూ మహిళలు వీలునామా రాసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. మహిళ చనిపోయాక ఆస్తుల విషయంలో పుట్టింటి, అత్తింటి వారికి వివాదాలు వస్తున్నాయని పేర్కొంది. వారసత్వ చట్టంలోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ ఒక మహిళ పిటిషన్ దాఖలు చేశారు. ఆ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ చట్టం ప్రకారం పిల్లలు లేని వితంతువు చనిపోతే ఆమె ఆస్తులు భర్త ఫ్యామిలీకి చెందుతాయి.


