News February 7, 2025
పోస్టులు తానే పెట్టినట్లు ఒప్పుకొన్న ఆర్జీవీ?

AP: సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫొటోల పోస్టుల కేసుపై ఒంగోలులో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో RGV కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ‘చంద్రబాబు, పవన్, లోకేశ్ ఫొటోలను మార్ఫ్ చేసి నేనే నా ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశా. వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగానే పోస్టులు చేశా. ఈ విషయంలో YCP నేతలకు సంబంధం లేదు. వారితో వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి’ అని చెప్పినట్లు సమాచారం.
Similar News
News March 24, 2026
ధురంధర్-2 ధమాకా.. ₹800కోట్లు దాటిన గ్లోబల్ కలెక్షన్లు

బాక్సాఫీసుపై ధురంధర్-2 దండయాత్ర కొనసాగుతోంది. ఈ మూవీ హిందీ వెర్షన్ నాలుగు రోజుల్లో ₹430కోట్ల నెట్ వసూలు చేసి పుష్ప-2 హిందీ వెర్షన్ (₹425.10కోట్లు) రికార్డ్ బ్రేక్ చేసింది. ఐదురోజుల్లో దేశంలో ఈ మూవీ గ్రాస్ ₹619.76కోట్లు ఉండగా గ్లోబల్ కలెక్షన్లలో గ్రాస్ ₹829.76కోట్లకు చేరినట్లు Sacnilk తెలిపింది. ఇదే జోరు కొనసాగితే మరో రెండు రోజుల్లో ధురంధర్-2 ₹1000కోట్ల మార్క్ చేరే అవకాశం ఉందని సినీ వర్గాల అంచనా.
News March 24, 2026
రూ.10వేలు తగ్గిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధర క్రమంగా తగ్గుతోంది. ఇవాళ కేజీ సిల్వర్ రేటు రూ.10,000 పతనమై రూ.2,40,000కు చేరింది. శుభకార్యాల వేళ వారం రోజుల్లోనే కేజీ సిల్వర్ రేటు రూ.40,000 తగ్గి కొనుగోలుదారులకు భారీ ఊరటనిచ్చింది. అయితే పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో పతనమవుతున్న ఈ ధరలు ఇన్వెస్టర్లకు నష్టాలనిస్తున్నాయి.
News March 24, 2026
RDT ఎలా ఏర్పాటైంది? వివాదమేంటి?

AP: 1969లో విన్సెంట్ ఫెర్రర్(స్పెయిన్) అనంతపురంలో కరవును తరిమికొట్టాలని RDTని స్థాపించారు. విద్య, వైద్యం, నీటి సంరక్షణ, రైతులకు శిక్షణ, స్వయం ఉపాధి, స్పోర్ట్స్ అకాడమీల ఏర్పాటు సహా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సంస్థ ప్రస్తుతం AP, TGలోని 3,500 గ్రామాల్లో సేవలు అందిస్తోంది. విదేశీ నిధులకు కీలకమైన FCRA లైసెన్స్‌ను 2023లో కేంద్రం నిలిపివేయడంతో వివాదం మొదలైంది. తాజాగా దాన్ని <<19461876>>రెన్యువల్<<>> చేసింది.


