News November 25, 2024
కోయంబత్తూరులో RGV?
డైరెక్టర్ RGV కోయంబత్తూరు (TN)లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా పోలీసుల విచారణకు వెళ్లకపోవడంతో వారు HYDలోని ఇంటికొచ్చారు. కాగా, ఆర్జీవీ నిన్న హీరో మోహన్ లాల్‌ను కలిసిన ఫొటో ‘X’లో పోస్ట్ చేయడంతో ఆయన షూటింగ్ కోసం వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు ఇంటికి రావడంపై RGV అడ్వకేట్ మండిపడ్డారు. డిజిటల్ విచారణకు సిద్ధంగా ఉన్నామని చెప్పినా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు.
Similar News
News November 25, 2024
కేర్‌టేకర్ చనిపోయిన రోజే జిరాఫీ మృతి
కొందరికి జంతువులతో ప్రత్యేక బంధం ఏర్పడుతుంది. జంతువులూ అలాంటివారిని ఎంతో ప్రేమిస్తుంటాయి. స్కోప్జే జూలో పనిచేసే కేర్‌టేకర్ ట్రాజ్‌కోవస్కీ కూడా అలాంటి కోవకు చెందినవారే. పదేళ్లపాటు ఫ్లాపీ అనే జిరాఫీని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. దానికి ఆహారంతో పాటు అన్ని బాగోగులు చూసుకునేవారు. అయితే, గత ఏడాది నవంబర్ 26న అనుకోకుండా ట్రాజ్‌కోవస్కీ చనిపోగా గంటల వ్యవధిలోనే జిరాఫీ కూడా చనిపోయింది.
News November 25, 2024
MHలో బిహార్ ఫార్ములా అమలు చేయండి: శివసేన
మహారాష్ట్రలో బిహార్ ఫార్ములా అమలు చేసి ఏక్నాథ్ శిండేను CMగా కొనసాగించాలని శివసేన కోరుతోంది. బిహార్‌లో RJDతో JDU విడిపోయినప్పుడు నితీశ్ కుమార్‌ను CMగా BJP కొనసాగించింది. 2020 బిహార్ ఎన్నికల్లో BJP 74 సీట్లు సాధించింది. JDUకి 43 సీట్లే దక్కినా అనంతర పరిణామాల్లో నితీశ్‌ను CMగా కొనసాగించింది. అదే మాదిరి MHలో BJP 132 స్థానాల్లో గెలిచినా శిండేకే CMగా అవకాశమివ్వాలని శివసేన కోరుతోంది.
News November 25, 2024
మైక్రోసాఫ్ట్లోఉండే ఈ వాల్‌పేపర్ ఖరీదెంతంటే?
కంప్యూటర్లో వినియోగించే మైక్రోసాఫ్ట్, విండోస్ XP ఆపరేటింగ్ సిస్టమ్‌లో కనిపించే వాల్‌పేపర్ ఫొటో తీసిందెవరో తెలుసా? అమెరికన్ ఫొటోగ్రాఫర్ చార్లెస్ ఓరీర్. 1996లో ఆయన తీసిన ‘The Bliss’ ఫొటో ఎంతోమందికి తెలియకుండానే ఫేవరెట్‌గా నిలిచింది. దీనికోసం మైక్రోసాఫ్ట్ ఆయనకు $100,000కి పైగా ఇచ్చినట్లు ‘Ladbible’ తెలిపింది. అలాగే పీటర్ బురియన్ తీసిన ‘Autumn wallpaper’ను మైక్రోసాఫ్ట్ XP $45కే కొనుగోలు చేసింది.