News June 4, 2024
పవన్ విజయంపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్

ఎన్నికల ముందు ట్విటర్ వేదికగా పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేసిన డైరెక్టర్ ఆర్జీవీ దారికొచ్చారు. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో విజయఢంకా మోగించడంతో ఆయన కళ్లు బైర్లు కమ్మినట్టున్నాయి. దీంతో ట్విటర్లో ‘హేయ్ పవన్ కళ్యాణ్’ అంటూ దండాలు పెట్టే ఎమోజీలను పోస్ట్ చేశారు. దీంతో ‘ఇప్పుడు తెలిసిందా పవన్ అంటే ఏంటో?’ అని ఆయన ఫ్యాన్స్ ఆర్జీవీని ప్రశ్నిస్తున్నారు.
Similar News
News October 27, 2025
గిన్నిస్ రికార్డు.. ప్రపంచంలోనే అతిచిన్న స్పూన్

ఒడిశాకు చెందిన బిజయ్ కుమార్ రెడ్డి అనే మినియేచర్ ఆర్టిస్ట్ ప్రపంచంలోనే అతిచిన్న చెక్క స్పూన్ రూపొందించి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పారు. ఈ స్పూన్ పొడవు 1.13mm. సూది కన్నులోంచి వెళ్లగలిగేంత చిన్నగా ఉంటుంది. దీనిని రూపొందించేందుకు 3 నెలల సమయం పట్టిందని, మైక్రోస్కోప్‌తో చూస్తేనే ఇది కనిపిస్తుందని బిజయ్ తెలిపారు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు బిహార్‌కు చెందిన వ్యక్తి(1.64mm) పేరిట ఉండేది.
News October 27, 2025
ఏ పంటలకు ఎలాంటి కంచె పంటలతో లాభం?

☛ వరి పొలం గట్ల మీద కంచె పంటలుగా బంతి మొక్కలను నాటి నులిపురుగుల ఉద్ధృతిని తగ్గించవచ్చు. ☛ పత్తి చేను చుట్టూ కంచెగా సజ్జ, జొన్న, మొక్కజొన్నను 3-4 వరుసల్లో వేస్తే బయటి పురుగులు రాకుండా ఆపవచ్చు. ☛వేరుశనగలో జొన్న, సజ్జ కంచె పంటలుగా వేస్తే రసం పీల్చే పురుగులు, తిక్కా ఆకుమచ్చ తెగులు ఉద్ధృతి తగ్గుతుంది. ☛ మొక్కజొన్న చుట్టూ 4, 5 వరుసల ఆముదపు మొక్కలను దగ్గరగా వేస్తే అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవచ్చు.
News October 27, 2025
అధికంగా తిని పూజలు చేయవచ్చా?

అధికంగా ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికే కాక, ఆధ్యాత్మిక పురోగతికి కూడా అడ్డంకి. మితిమీరిన ఆహారం వలన ఆయువు క్షీణించి, స్వర్గసుఖములు దూరమవుతాయి. ఇది మనస్సును అశాంతపరుస్తుంది. అంతేకాక ఇతరుల దృష్టిలో తిండిపోతుగా నిందలకు గురికావాల్సి వస్తుంది. అందుకే దేవుడిచ్చిన పవిత్ర జీవితాన్ని, దైవ చింతనలో ఉండాలనుకునేవారు అధికంగా ఆహారాన్ని స్వీకరించకూడదు. మితాహారమే భక్తి మార్గంలో మనసును స్థిరంగా ఉంచుతుంది. <<-se>>#Aaharam<<>>


