News January 7, 2025
వరికి బీమా గడువు 15 వరకు పొడిగింపు
AP: వరి పంటకు ప్రీమియం చెల్లింపు గడువును ఈ నెల 15 వరకు బీమా కంపెనీలు పెంచాయి. జీడి పంటకు గత ఏడాది నవంబర్ 22, మిగతా అన్ని పంటలకు డిసెంబర్ 31తోనే గడువు ముగిసింది. వీటికి కూడా ప్రీమియం చెల్లింపునకు మరింత అవకాశం ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. గత ఏడాది 43.82 లక్షల మంది రైతులకు బీమా లభించగా, ఈసారి రబీలో 7.6 లక్షల మందికే కవరేజ్ లభించిందని పేర్కొంటున్నారు.
Similar News
News January 8, 2025
కాంగ్రెస్‌కు షాక్: ఢిల్లీలో ఆప్కే INDIA మద్దతు
‘INDIA’లో కాంగ్రెస్‌పై అపనమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలన్నీ AAPకే మద్దతు ఇస్తున్నాయి. SP, SS UBT, TMC, RJD అరవింద్ కేజ్రీవాల్‌కు అండగా ప్రచారం చేయనున్నాయి. హస్తం పార్టీనెవరూ పట్టించుకోవడం లేదు. నిజానికి అగ్రనేతలు రాహుల్, ప్రియాంకా గాంధీలే లైట్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ప్యారీ దీదీ స్కీమ్‌నూ DK శివకుమార్ ప్రకటించారు. INC ఎలాగూ గెలవదనే కూటమి AAP వైపు మళ్లినట్టుంది.
News January 8, 2025
BITCOIN షాక్: 24 గంటల్లో Rs5 లక్షల నష్టం
క్రిప్టో మార్కెట్లు గత 24 గంటల్లో భారీగా పతనమయ్యాయి. మార్కెట్ విలువ 6.29% తగ్గి $3.36Tకు చేరుకుంది. బిట్‌కాయిన్ ఏకంగా 5.45% ఎరుపెక్కింది. $1,02,000 నుంచి $96,000కు తగ్గింది. అంటే $6000 (Rs 5.10L) నష్టపోయింది. మార్కెట్ విలువ $1.91Tకి తగ్గింది. ఇథీరియం 9.98% పడిపోయి $3,349 వద్ద కొనసాగుతోంది. XRP 4.16, BNB 4.59, SOL 8.95, DOGE 10.53, ADA 8.77, TRON 7.56, SUI 7.32, LINK 10.51% మేర ఎరుపెక్కాయి.
News January 8, 2025
ఒకరి మృతి.. అస్సాంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
అస్సాం దిమా హసావా జిల్లాలోని కోల్‌మైన్‌లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ నెల 6న గనిలోకి ఒక్కసారిగా నీరు చేరడంతో కార్మికులు కేకలేస్తూ బయటికి వచ్చారు. మైన్‌లో చిక్కుకుపోయిన వారిలో ఒకరి మృతదేహాన్ని నేడు వెలికి తీయగా మరో 8మంది కోసం గాలిస్తున్నారు. అయితే మైన్‌లో 15-16 మంది చిక్కుకున్నట్లు అక్కడ పనిచేసే ఓ మైనర్ చెప్పాడు. ఘటనకు కారణమైన వారిపై కేసు నమోదు చేయాలని ఆ రాష్ట్ర CM బిశ్వశర్మ ఆదేశించారు.