News September 18, 2024

పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్‌గా రికీ పాంటింగ్

image

ఐపీఎల్‌లో వచ్చే సీజన్‌కు తమ కొత్త కోచ్‌గా రికీ పాంటింగ్‌ను పంజాబ్ కింగ్స్ నియమించింది. ఈ మేరకు ట్విటర్‌లో ప్రకటించింది. ‘పంటర్(పాంటింగ్) ఈజ్ పంజాబ్! మా కొత్త హెడ్‌ కోచ్ పదవిలో పాంటింగ్ జాయిన్ అయ్యారు’ అని పేర్కొంది. గడచిన 7 సీజన్లలో ఆ జట్టు ఆరుగురు కోచ్‌లను మార్చడం గమనార్హం. కాగా పాంటింగ్ ఇంతకుముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌గా పనిచేశారు.

Similar News

News January 22, 2026

మదురో అరెస్ట్ ఆపరేషన్‌లో సీక్రెట్ వెపన్.. కన్ఫమ్ చేసిన ట్రంప్!

image

వెనిజులా మాజీ అధ్యక్షుడు మదురోను అదుపులోకి తీసుకున్న సమయంలో ఓ ప్రత్యేక రహస్య ఆయుధం వాడినట్లు వచ్చిన వార్తల్ని ట్రంప్ ధ్రువీకరించారు. తమ వద్ద ప్రపంచంలో ఏ దేశం దగ్గరా లేని ఆయుధాలు ఉన్నాయని తెలిపారు. వాటి గురించి అంతగా మాట్లాడకపోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. అవి చాలా శక్తిమంతమైనవని.. వాటి గురించి ఎవరికీ తెలియదన్నారు. మదురో అరెస్ట్ ఆపరేషన్‌లో సోనిక్ వెపన్ ప్రయోగించినట్లు వార్తలు వచ్చాయి.

News January 22, 2026

గర్భాశయం పొర మందంగా ఉందా?

image

స్త్రీ సంతానోత్పత్తిలో గర్భాశయం పొర ఎండోమెట్రియల్ మందం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అయితే కొందరిలో ఎండోమెట్రియల్ లైనింగ్ మందం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల నెలసరిలో బ్లీడింగ్ ఎక్కువరోజులు కావడం, స్పాటింగ్ కనిపించడం వంటివి జరుగుతాయంటున్నారు నిపుణులు. దీనికి ప్రధాన కారణం హార్మోన్లు. ఈ సమస్య తరచూ వస్తుంటే ఎండోమెట్రియల్ క్యాన్సర్‌కు దారితీస్తుందంటున్నారు. కాబట్టి వెంటనే చికిత్స తీసుకోవాలి.

News January 22, 2026

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌(<>BEL<<>>)పంచకుల 7ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు నేటి నుంచి FEB 5 వరకు అప్లై చేసుకోవచ్చు. BE/BTech/BSc(engg.) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40వేలు చెల్లిస్తారు. ఏడాదికి ₹.5వేలు పెంచుతారు. సైట్: bel-india.in