News October 25, 2024

జాలీ ట్రిప్ అని పిలిచి రైడ్స్

image

కేరళలో తొలిసారి GST అధికారులు కమాండో తరహా ఆపరేషన్‌తో 108 కేజీల అక్రమ బంగారం సీజ్ చేశారు. KLలోని 700 మంది ఆఫీసర్లను సరదా ట్రిప్ అని గోల్డ్ హబ్ త్రిస్సూర్‌లో ఓ రిసార్టుకు పిలిచారు. అంతా చేరాక ఆపరేషన్ ‘గోల్డ్ టవర్’ గురించి చెప్పి దాడులకు పంపారు. ఈ హఠాత్ పరిణామంతో కొన్ని షాపుల సిబ్బంది పసిడితో పారిపోతుంటే వెంబడించి పట్టుకున్నారు. KLలో బంగారం అమ్మకాల గణాంకాలు, పన్ను చెల్లింపుల మధ్య భారీ తేడా ఉంది.

Similar News

News October 25, 2024

టీమ్ ఇండియాకు సరికొత్త ‘వాల్’ కావాలి

image

టీమ్ ఇండియాలో టాలెంటెడ్ ఆటగాళ్లకు కొదువ లేకపోయినా టెస్టుల్లో నిలదొక్కుకొని ఆడే ప్లేయర్ కొరత కొంత కాలంగా వేధిస్తోంది. ‘ది వాల్’ ద్రవిడ్ తర్వాత ఆయన స్థానాన్ని కొంత మేర పుజారా భర్తీ చేశారు. అయితే ఆయన ఫామ్ లేమితో జట్టుకు దూరమవ్వగా ఇప్పుడు ఆ ప్లేస్‌లో కొరత ఉందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. మరి ఇప్పటికైనా జట్టు యాజమాన్యం ఆ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్‌ను అన్వేషిస్తుందా లేదా వేచి చూడాలి.

News October 25, 2024

BREAKING: పోలీసు శాఖ కీలక నిర్ణయం

image

TG: రాష్ట్రంలో బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యుల ఆందోళనలతో పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సెలవుల విధానంపై ఇటీవల ఇచ్చిన ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది. మరోవైపు ఐదేళ్లు ఒకే చోట పోస్టింగ్, ఒకే రాష్ట్రం-ఒకే పోలీసింగ్ విధానం తీసుకురావాలని కానిస్టేబుళ్ల కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

News October 25, 2024

ముద్ర రుణాల పరిమితి పెంపు

image

ముద్ర రుణాల పరిమితిని కేంద్రం రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని చెప్పింది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థల కోసం కేంద్రం ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. ఇప్పటివరకు 3 రకాలుగా రూ.50వేలు, రూ.50వేలు నుంచి రూ.5లక్షలు, రూ.5-10లక్షలు లోన్స్ అందించింది. తాజాగా రూ.10-20 లక్షల రుణాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వ బ్యాంకుల్లో 9.15-12.80 వడ్డీతో పొందొచ్చు.